ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ ..!

ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ ..!
Views:
15

హైదరాబాద్, 29 మే:

తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సధుపాయలను కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది.

ఇప్పటికే మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్, బాలికలకు హెల్త్ కిట్స్ లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం, మరో కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనుంది.

ఇప్పటివరకు ప్రైవేట్ స్కూల్స్‌కి పరిమితమైన బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని ఈ విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలుచేయాలని చూస్తోంది.

ఈ మేరకు ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాలోని పాఠశాలల్లో ప్రారంభించనున్నారు. ఇక ఈ విధానంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు దీనికి సంబంధించిన చర్యలు చేపట్టారు.

కాగా, బయోమెట్రిక్ మెషీన్స్ అందిచే సర్వీస్ ప్రొవైడర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.

అలాగే ఏయే జిల్లాల్లో, ఎన్ని స్కూళ్లలో ప్రయోగాత్మంగా ఈ విధానాన్ని అమలు చేయొచ్చనే అంశంపై ప్రతిపాదనలు తయారుచేసి ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతామన్నారు.

మామాట: మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు…

(Visited 19 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: