పార్టీకి సోనియా భారీ శస్త్రచికిత్స: జి-23తో పనిలేదు: వీరప్ప మొయిలీ

Share Icons:
  • పార్టీలో కోరుకున్న సంస్కరణలు మొదలయ్యాయి. పార్టీ నాశనాన్ని కోరుకోలేదు

కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ ఆఫ్ 23 ఇక పని లేదనే అంటున్నారు పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి వీరప్ప మొయిలీ .గతంలో పార్టీ లో ప్రక్షాళన జరగాలని కోరుకున్నామని అది మేడం సోనియా గాంధీ చేస్తున్నారని అందువల్ల జి -23 తో పనేముంది అని అన్నారు . మేము కోరుకొన్నది సోనియా కోరుకున్నప్పడుడు పార్టీ బాగు కోరే వాళ్ళు పార్టీ పై ఇక నిందలు వేయడం తగదని ఆయన  అభిప్రాయo. పార్టీలో సంస్కరణలు అంతర్గతంగా రావాలన్న ఉద్దేశంతో తమలో కొందరు గతంలో రాసిన లేఖలపై సంతకాలు చేశామని, పార్టీలో పునర్నిర్మాణం జరగాలనే తాము కోరుకున్నాం తప్పితే, పార్టీ నాశనాన్ని తాము కోరుకోలేదన్నారు.

ఇంకా ఎవరైనా పట్టుబడుతున్నారంటే దాని వెనక స్వార్థ ప్రయోజనాలు ఉన్నట్టేనని కుండబద్దలు కొట్టారు. తాము కోరుకున్న భారీ శస్త్రచికిత్స పార్టీలో మొదలైందని, సోనియా గాంధీ అవసరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనను ఆయన సమర్థించారు.

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply