కుమారుడు మోదీ క్యాబినెట్ లో మంత్రి… తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు!

Share Icons:
  • మోదీ క్యాబినెట్ విస్తరణలో ఎల్.మురుగన్
  • రేకుల ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రులు

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేంద్ర క్యాబినెట్ ను విస్తరించిన క్రమంలో తమిళనాడు బీజేపీ చీఫ్ ఎల్.మురుగన్ కు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది. మురుగన్ కు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయమంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర మంత్రి అయినా, ఆయన తల్లిదండ్రులు మాత్రం కూలీలుగా బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. కుమారుడు కేంద్ర మంత్రి అయితే ఏంటి? అతడు మా సాయం లేకుండా స్వశక్తితో రాజకీయాల్లో ఎదిగాడు…  మాకేంటి సంబంధం? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.

మురుగన్ స్వస్థలం తమిళనాడులోని నమ్మకల్ జిల్లా కోనూర్ గ్రామం. మురుగన్ తల్లిదండ్రుల పేర్లు వరుదమ్మాళ్ (59), లోగనాథన్ (68). వారిది దళిత వర్గంలోని అరుంధతీయార్ సామాజిక వర్గం. పేద కుటుంబం కావడంతో ఇప్పటికీ వరుదమ్మాళ్, లోగనాథన్ ఊర్లోని భూస్వాముల పొలాల్లో కూలి పనులకు వెళుతుంటారు. నేటికీ వారు ఓ రేకుల ఇంట్లోనే నివసిస్తున్నారు. ఓ పాత సైకిల్ తప్ప మరో వాహనం లేదు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply