టీడీపీకి భారీ షాక్ తగిలేలా ఉందిగా…ఆ నేతలు గుడ్ బై?

main leaders ready to leave tdp
Share Icons:

అమరావతి: ఏంటో ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పరిస్తితి అసలు బాగోలేదని చెప్పాలి. ఓడిపోయిన నేతలు పార్టీలో యాక్టివ్ గా ఉండటం మానేయగా, గెలిచిన నేతలు ఎవరు పని వారు చేసుకుంటున్నారు. మరికొందరు నేతలు పార్టీ మారిపోతున్నారు. ఇప్పటికే చాలామంది బీజేపీ, వైసీపీల్లోకి చేరిపోయారు. ఈ క్రమంలోనే ఏపీలో మరికొంతమంది నేతలు పార్టీ జంప్ చేయడానికి చూస్తున్నారట. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అందులో మొదట  మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు టీడీపీని వీడటం ఖాయమంటున్నారు. మొదటి నుంచి ఈయన పార్టీ మారుతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటిని ఖండించిన ప్రచారం మాత్రం ఆగలేదు. వైసీపీలోకి తాను వెళ్లాలనుకుంటే ఎవ్వరూ ఆపలేరని ఆ మధ్యన గంటా కామెంట్లు కూడా చేశారు. అయితే వైసీపీలోకి ఈయన రాకను కొంతమంది వ్యతిరేకిస్తున్నారని గాసిప్‌లు వినిపించినా.. ఇప్పుడు గంటా చేరికకు అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. దీంతో త్వరలోనే గంటా కూడా వైసీపీ కండువాను కప్పుకోనున్నారని సమాచారం.

ఇక 2014 ఎన్నికల్లో గెలిచి టీడీపీలో చేరిన గొట్టిపాటి రవికుమార్….మొన్న ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందారు. దీంతో ఈయన కూడా పార్టీ మారతారని వార్తాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఈయన వైసీపీలోకి వెళ్లతారని తెలుస్తోంది. అటు విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కూడా జంప్ అవ్వడం ఖాయమంటున్నారు. మొన్నటివరకు ఈయన పార్టీని వీడటం ఖాయమన్నారు. కానీ తర్వాత చంద్రబాబు సర్ది చెప్పడంతో ఆగినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ మారడానికి చూస్తున్నారని, ఆయన వైసీపీలోకి వెళ్లిపోతారని అంటున్నారు.

అయితే బోండా, గంటా చూపు వైసీపీ వైపు ఉంటే.. మాజీ మంత్రి నారాయణ చూపు మాత్రం బీజేపీ వైపు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా టీడీపీకి ఆర్థిక స్తంభంగా నిలిచిన నారాయణకు సంబంధించి విద్యా సంస్థలపై ఎన్నికలకు ముందే ఐటీ, సీబీఐ దాడులు జరిగాయి. ఇక అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐను రాష్ట్రంలోకి అనుమతినిస్తూ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో మళ్లీ ఎప్పుడైనా దాడులు జరిగితే.. ఆయన విద్యా సంస్థలకు ముప్పు వాటిల్లే  పరిస్థితి తప్పకపోవచ్చు. ఇక రాజకీయాల కంటే తమ వ్యాపారాలే కీలకమని భావించిన కొంతమంది టీడీపీ ఎంపీలు ఆ మధ్యన మూకుమ్మడిగా బీజేపీలో చేరారు. ఇప్పుడు వారి బాటలోనే నారాయణ కూడా వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం.

 

Leave a Reply