బాబోయ్…అమ్మాయిలు మా మీద అఘాయిత్యం చేస్తున్నారు…

Some girls are rape attempt on boys
Share Icons:

ఢిల్లీ, 13 జూన్:

మనదేశంలో ప్రతిరోజూ బాలికలు, మహిళల మీద కొందరి మగాళ్లు అఘాయిత్యాలకి పాల్పడుతున్న ఘటనలకి సంబంధించిన వార్తలు మనం చాలానే వింటున్నాం, చూస్తున్నాం. అయితే దీనికి పూర్తిగా విరుద్ధంగా అమ్మాయిలు తమపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారంటూ కొందరు అబ్బాయిలు ఢిల్లీలోని ఓ కాల్‌సెంటర్‌కి ఫోన్ చేసి తమ బాధని చెప్పుకుంటున్నారట..

ఈ మధ్య మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయియాని ఢిల్లీ సర్కార్ వారికోసం ఓ ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ఎవరికైనా ఆపద ఉంటే ఈ నెంబర్‌కు కాల్ చేయండి అంటూ ప్రకటన చేసింది.

అయితే ఈ కాల్ సెంటర్ ప్రారంభించిన కాసేపటికే కాల్స్ రావడం మొదలయ్యాయి. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే…. మేం అత్యాచారానికి గురయ్యాం అని ఆడవాళ్ళ కంటే మగాళ్ళే ఎక్కువ ఫోన్ చేశారంటా! అందులో ఓ ఫిర్యాదు దారుని వాదన ఏంటంటే….ఒకరు కాదు ఇద్దరు ఏకంగా నలుగురైదుగురు ఆడాళ్ళు ఒంటరిగా ఉన్న మగాణ్ణి కిడ్నాప్ చేసి రేప్ చేశారంటా. అంతే కాకుండా ఈ తతంగాన్నంతా వీడియో కూడా తీసారట.

అయితే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ వార్త ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, మగాళ్ళపై మహిళలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటనలు కూడా ఈ మద్యకాలంలో చాలానే జరిగాయి. ఈ మధ్య టాక్సీ డ్రైవర్‌ను ఇంటిదాకా తీసుకెళ్ళి అతనిపై అత్యాచారానికి పాల్పడ్డ మహిళ గురించిన వార్త కూడా సంచలనాన్ని రేపింది. అలాగే విజయవాడలో ఓ 14 ఏళ్ళ బాలుడుపై 40 ఏళ్ల  మహిళ అత్యాచారాయత్నం చేసింది. ఇలా వెలుగులోకి రాని ఇటువంటి ఘటనలు అనేకం ఉన్నాయి.

మామాట: నన్నపనేని రాజకుమారి చెప్పినట్లు పురుషులకు కూడా ఓ కమీషన్ ఏర్పాటు చేయాలేమో…?

Leave a Reply