ఐపీఎల్‌లో ఫైయిల్ అయిన కెప్టెన్లు ఎవరంటే…?

Some big captains failure in the IPL
Share Icons:

ఢిల్లీ, 21 మే:

టీ20 మ్యాచుల్లో…అందులోనూ ఐపీఎల్ లాంటి టోర్నీల్లో కెప్టెన్సీకి పెద్దగా ప్రాధాన్యం ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ ఆ అభిప్రాయం తప్పుని చాలాసార్లు రుజువైంది. ప్రస్తుతం నడుస్తున్న ఈ ఐపీఎల్ లీగ్‌లు కెప్టెన్సీ అనేది ఎంత కీలకమో మరోసారి నిరూపితమైంది.

Captain kohli said chennai is the his favorite team

ఆటగాడిగా ఎంత గొప్ప పేరున్నా.. కెప్టెన్సీ చేపట్టడం అంత సులువైన విషయం కాదని తేలింది. ముఖ్యంగా ఐపీఎల్ కెప్టెన్సీలో ఉన్న తేడా ఏంటో అందరికీ తెలిసొచ్చింది. భారత జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి చాలా గొప్ప రికార్డుంది. కానీ ఐపీఎల్లో మాత్రం అతని కెప్టెన్సీ రికార్డు పేలవం. చాలా ఏళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును నడిపిస్తున్న అతను ఒక్కసారీ కూడా టైటిల్ గెలిపించలేకపోయాడు.

rohith sharma captain

ఒక్క 2016 టోర్నీలో మాత్రమే జట్టును ఫైనల్ చేర్చాడు. అప్పుడు కూడా కోహ్లీ అసాధారణంగా ఆడబట్టి ఆ జట్టు అక్కడిదాకా వెళ్లింది. కానీ గత సీజన్.. ఈ సీజన్లో ఆ జట్టు ప్రదర్శన పేలవం. వరుసగా రెండోసారి కూడా ప్లేఆఫ్ చేరకుండానే నిష్క్రమించింది. కోహ్లీ కెప్టెన్సీ వైఫల్యం ఈ సీజన్‌లో స్పష్టంగా కనిపించింది. మరోవైపు రోహిత్ శర్మ కూడా ఈసారి విఫలమయ్యాడు. ముంబయికి మూడు కప్పులు అందించిన అతను.. ఈసారి జట్టులో స్ఫూర్తి నింపలేకపోయాడు. ఇటు బ్యాట్స్‌మెన్‌గా విఫలమయ్యాడు. అటు వ్యూహాల్లోనూ ఫెయిలయ్యాడు.

aswin

ఇక లీగ్‌లో తొలిసారి నాయకత్వ బాధ్యతలు అందుకున్న అశ్విన్. టోర్నీ ఆరంభంలో తెలివైన నాయకుడిలా కనిపించాడు. పంజాబ్ మొదట ఆడినా ఆరు మ్యాచుల్లో ఐదు నెగ్గడంతో అతడిపై ప్రశంసలు కురిశాయి. కానీ తర్వాత ఎనిమిద మ్యాచుల్లో పంజాబ్ ఏడు ఓడిపోయింది. దీంతో పంజాబ్ టోర్నీ నుండి నిష్క్రమించింది. ఇలాంటి పతనం ఇంతకుముందు ఏ జట్టు విషయంలోనూ జరగలేదు. దీంతో అశ్విన్‌ను పొగిడిన నోళ్లే తెగిడాయి. ఇక వచ్చే ఏడాదికి అతడి కెప్టెన్సీ నిలవడం కూడా సందేహమే.

dhoni and williamson ipl

హిట్టయినా ధోని, విలియమ్సన్

వీళ్ల సంగతిలా ఉంటే.. సన్ రైజర్స్‌ను కేన్ విలియమ్సన్, చెన్నై సూపర్ కింగ్స్‌ను ధోని నడిపించిన వైనం ప్రశంసలందుకుంది. వీళ్లిద్దరూ బ్యాటింగ్‌లో జట్టును ముందుండి నడిపించారు. అలాగే వ్యూహాల్లోనూ తమకు తిరుగులేదని చాటుకున్నారు. ముఖ్యంగా వార్నర్ స్థానంలోకి వచ్చిన కేన్ ఆశ్చర్యపరిచాడు. ఇక ఒకరకంగా చెప్పాలంటే వీరి కారణంగానే ఈ టోర్నీలో ఇరు జట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచాయి.

ఇక రాజస్థాన్ సారథి రహానె.. కోల్‌కతా కెప్టెన్ దినేశ్ కార్తీక్ యావరేజ్ మార్కులేయించుకున్నారు. తమ జట్లను కష్టపడి ప్లేఆఫ్‌కు చేర్చడంలో సఫలమయ్యారు. అలాగే ఢిల్లీ బాధ్యతలను గౌతమ్ గంభీర్ మధ్యలో వదిలేయగా.. అతడి స్థానంలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ పర్వాలేదనిపించాడు.

మామాట: మొత్తానికి ఇద్దరు కెప్టెన్లకే డిస్టింక్షన్ వచ్చింది అనమాట…

Leave a Reply