త్వరలో ఏపిలో స్మార్ట్‌ విద్యుత్తు మీటర్లు!

Smart power meters soon in AP
Share Icons:

కొత్త ఢిల్లీ, మార్చి 19,

ఏపి, బిహర్‌లలో ప్రభుత్వ రంగానికి చెందిన ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్‌ ( ఈఈఎస్‌ఎల్‌), ఫ్రాన్స్‌కు చెందిన ఎలక్ట్రిక్‌ ది ప్రాన్స్‌ ఎస్‌ఏ ( ఈడీఎఫ్‌)లు కలిసి సుమారు. 50 లక్షల స్మార్ట్‌ మీటర్లను ఏర్పాటుచేయనున్నట్టు సమాచారం.

ఈ కాంట్రాక్టులో ఈడీఎఫ్‌కు 95శాతం వాటా ఉండగా.. యాక్సెంచర్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ ఇండియాకు 5 శాతం వాటా ఉంది. ఈ కన్సార్టియం మీటర్లను అమర్చడం, వాటిని విద్యుత్తు సంస్థ బిల్లింగ్‌ వ్యవస్థకు అనుసంధానించడం చేస్తుంది. తొలుత ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌లలో మొదలు పెట్టనున్నట్లు ఫ్రెంచి రాయబార కార్యాలయం వెల్లడించింది.

స్మార్ట్‌ మీటర్లను అమర్చడం వల్ల బిల్లింగ్‌, మీటరింగ్‌, కలెక్షన్లలో మానవజోక్యం చాలా తగ్గిపోతుంది. ఈ పద్దతి వల్ల విద్యుత్తు దొంగతనం జరిగే ప్రదేశాలను తేలిగ్గా గుర్తించవచ్చు. దీనికి ప్రత్యేకమైన కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌, కంట్రోల్‌ సెంటర్‌ పరికరాలు, సాఫ్ట్‌వేర్‌ అవసరం. ఇవి క్షేత్రస్థాయిలో వచ్చే విద్యుత్తు, పంపిణీ చేసిన విద్యుత్తులో వినియోగించిన మొత్తాన్ని లెక్కగడతాయి. తద్వారా విద్యుత్ పంపిణీలో జరిగే నష్టాన్ని నియంత్రించ వచ్చు.

మామాట:   విద్యుత్ ఆదా అంటే విద్యుత్ ఉత్పత్తే కదా,

Leave a Reply