Header Banner
Header Banner
TRENDING NOW

వైసీపీ లోకి ఆరుగురు

వైసీపీ లోకి ఆరుగురు

హైదరాబాద్‌,  మార్చి 16,

ఏపీ లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ నేతల వలసలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు  తాముంటున్న పార్టీకి రాం రాం చెప్పి కొత్త పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు టిడిపి కూడా వైఎస్‌ఆర్‌సిపి నేతలకు ఎరవేస్తుంది. ఎవరు గాలానికి చిక్కితే వారిని లాగేయడం. నయానో, భయానో, బుజ్జగించడం జరుగుతోంది. కాగా నేడు జగన్‌ సమక్షంలో రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన ఆరుగురు కీలక నేతలు వైఎస్‌ఆర్‌సిపిలో చేరుతున్నారు.  రాష్ట్ర రాజకీయాలలో సీనియర్  నేతగా మంచి గుర్తింపున్న కొణతాల రామకృష్ణ, బుట్టా రేణుక, మాగుంట శ్రీనివాసులురెడ్డి, వంగా గీత, బల్లి దుర్గా ప్రసాద్‌, ఆదాల ప్రభాకరరెడ్డి వైఎస్‌ఆర్‌సిపిలో చేరనున్నారు.

treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy

జగన్‌ ప్రస్తుతం కడప జిల్లాలో వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌కు రాగానే జగన్ సమక్షంలో వీరు ఈ ఆరుగురు పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్టు సమాచారం.

మామాట: విలువలా తొక్కా.. పదవి కోసం మారుతున్నారు.. అంతేగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: