బాబుకు మరో రెండు నోటీసులు రాబోతున్నాయి…

Share Icons:

విజయవాడ, 14 సెప్టెంబర్:

2010నాటి బాబ్లీ ఘటనకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు నిన్న సాయంత్రం మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే విషయంపై ఏపీలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా బీజేపీ కుట్ర అని టీడీపీ అంటుంటే…తమకేమీ సంబంధం లేదని బీజేపీ వాదిస్తోంది.

అయితే ఒకవైపు దీని గురించి వాదోపదనాలు జరుగుతుండగానే….మరోవైపు ఆపరేషన్ గరుడ’ను తెరపైకి తెచ్చిన సినీ నటుడు శివాజీ ఈరోజు ఇంకో బాంబు పేల్చారు. చంద్రబాబుకు మరో రెండు నోటీసులు రాబోతున్నాయని, చంద్రబాబు వారి ట్రాప్‌లో పడొద్దని శివాజీ సూచించారు. ఆ రెండు నోటీసులు కూడా త్వరలోనే వస్తున్నాయని చెప్పుకొచ్చారు.

ఇక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదని,  కుర్చీ కాంక్ష మొదలైనప్పుడే విధ్వంసం మొదలవుతుందని శివాజీ చెప్పారు. అసలు జనవరిలో ఎన్నికలు వస్తాయని జగన్ ఎలా చెప్పగలుగుతున్నారని,  ఏదో విధంగా చంద్రబాబును ఒంటరి చేసి, ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో మోదీకి ఎదురుగా నిలబడ్డ వ్యక్తి చంద్రబాబు ఒక్కరేనని, ఐక్యరాజ్యసమితిలో మాట్లాడే అవకాశం చంద్రబాబుకు దక్కడం తెలుగుజాతికి గౌరవమని శివాజీ అభిప్రాయపడ్డారు.

మామాట: మీరు టీడీపీకి మద్ధతుగా బాగానే మాట్లాడుతున్నారుగా..

One Comment on “బాబుకు మరో రెండు నోటీసులు రాబోతున్నాయి…”

  1. Meeru ycheepiki baga support chesthunaru GA….10 years back case’s todadam kadhu…dhamu unte epudu edho avinithi jarigindhi ani moruguthunayee kadha kukkalu …vati meedha enquiry veyandi ra ba& ycheep jaffas….

Leave a Reply