రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా శిరిష రికార్డు

Share Icons:

వర్జిన్‌ గెలాక్టిక్‌ చేపట్టిన అంతరిక్ష యాత్ర విజయవంతమైంది. అంతరిక్షంలోకి చక్కర్లు కొట్టి తిరిగి భూమిని చేరుకుంది, రోదసీలోకి వెళ్లి వచ్చిన నాలుగో భారతీయరాలుగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన గుంటూరు యువతి  శిరిష బండ్ల రికార్డు సృష్టించింది. గతంలో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్‌ స్పేస్‌లో ప్రయాణించారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ షిప్‌లో ఆ సంస్థ అధిపతి రిచర్బ్‌ బ్రాన్సన్‌తో  5గురు సభ్యులతో కలిసి శిరీష అంతరిక్ష ప్రయాణం చేసింది. ఈ ప్రయోగం 90 నిమిషాల పాటు సాగింది. ఈ షిప్‌లో భాగస్వామి కావడం తనకెంతో గౌరవకారణమని శిరీష ట్వీట్‌ చేశారు. వర్జిన్‌ గెలాక్టిక్‌ అంతరిక్ష యాత్రకు సంబంధించిన లైవ్‌ను యూట్యూబ్‌లో షేర్‌ చేసింది.

సేకరణ :-  మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

 

Leave a Reply