గోదావరి బరాజ్ నిర్మాత సర్ ఆర్థర్ కాటన్ (1)

Share Icons:

గోదావరి బరాజ్ నిర్మాత సర్ ఆర్థర్ కాటన్ 

నీటివనరులె జాతి సిరులని, జనుల కొఱకే మనిన

కారణజన్ముడవు నీవు, ఇది నీవు పెట్టిన దీపమే!

నిత్యగోదావరీ స్నాన పుణ్య దోయా మహామతిః

స్మరామ్యాంగ్లదేశీయం కాటనుం, తం భగీరథం!

కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకొనే జనరల్ సర్ ఆర్థర్ కాటన్ 1803 మే 15న ఆక్స్‌ఫర్డ్ లో హెన్రీ కాల్వెలీ కాటన్, ఆయన శ్రీమతికి పదవ కుమారునిగా జన్మించాడు. కాటన్ తన జీవితాన్ని భారతదేశంలో నీటిపారుదల,కాలువలు కట్టించడానికి ధారపోసాడు. ఈయన జీవితలక్ష్యం మరణించేసరికి పాక్షికంగానే నెరవేరింది.

1819లో మద్రాసు ఇంజనీర్స్‌ దళఒలో చేరి మొదటి బర్మా యుద్ధంలో పాల్గొన్నాడు. 1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడయ్యాడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ ఆర్టిలరీ ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. కాటన్ ముఖ్యంగా కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు.

ఈ కాలువల విభజన,అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి జిల్లాలను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడులు గల జిల్లాలుగా మార్చాయి.కాటన్ 1836- 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు.ఆ తర్వాత 1847- 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేసాడు.క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కళకళలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది.ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తిచేసాడు.కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్ దొరదే.ఇంతేకాక ఆయన బెంగాల్,ఒరిస్సా,బీహార్,మొదలైన ప్రాంతాల నదులను ప్రజలకు ఉపయోగ పడటానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేసాడు.ఆ మనీయుడు, 25-07-1899న,  డోర్కింగ్ లో  (బ్రిటన్) మరణించారు.

తెలుగు వారేకాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, బీహారీలు… మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు. గోదావరీ నదికి ఆనకట్ట కట్టి ఆంద్ర దేశానికి ‘అన్నదాత’ గా ప్రసిద్ధి చెందిన కాటన్ దొర పాలరాతి విగ్రహాన్నిఆ నదీ తీరాన్నే ప్రతిష్టించారు. కొన్నేళ్ళక్రితం  క్రితం కాటన్ దొర మునిమనవడు అయిన శ్రీ రాబర్ట్ కాటన్, ఆంధ్రదేశానికి వచ్చి,గోదావరీ తీరాన్నిమొత్తం తనివితీరా పరిశీలించి,ఆంద్రదేశ ప్రజలు,కాటన్ దొరని స్మరించుకుంటున్నతీరుని చూసి ఆనందబాష్పాలు కార్చారు..

కాటన్ కృషి చేసి విజయాన్ని సాధించిన ప్రాజెక్టులలో గోదావరి నుండి నిర్మించిన కాలువల నిర్మాణం మొదటిదిగా చెప్పవచ్చు. ఈ కాలువల విభజన, అన్ని ప్రాంతాలను కలుపుతూ సాగే విస్తరణ, ఒకప్పుడు వ్యవసాయంలో సామాన్య దిగుబడితో ఉన్న గోదావరి పరివాహక జిల్లా లను అత్యంత అభివృద్ది, అధిక వ్యవసాయ దిగుబడుల జిల్లాలుగా మార్చేశాయి. కాటన్ 1836 – 38 సంవత్సరాలలో కొలెరూన్ నదిపై ఆనకట్టను నిర్మించాడు. దానితో తంజావూరు జిల్లా మద్రాసు రాష్ట్రంలోనే కాక, యావత్భారత దేశంలోనే ధనధాన్య సమృద్ధికి ప్రథమ స్థానం పొందింది. ఆ తర్వాత 1847 – 52 సంవత్సరాలలో గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తిచేశాడు. క్షామపీడితమైన గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకలలాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య మూడు రెట్లు పెరిగింది. ఆరు లక్షల ఎకరాల భూమి సాగు కిందికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం అయిదేళ్ళలో పూర్తి చేశాడు. కృష్ణానదిపై విజయవాడ వద్ద ఆనకట్టకు ప్రోద్బలం కూడా కాటన్‌ దే. ఇంతేకాక ఆయన బెంగాల్, ఒడిసా , బీహారు, మొదలైన ప్రాంతాల నదులను మానవోపయోగ్యం చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశాడు. తెలుగు వారే కాదు తమిళులు, ఒరియాలు, బెంగాలీలు, ఒరియాలు, బీహారీలు మొత్తం భారతీయులే ఆయనకు శాశ్వత ఋణగ్రస్తులు.

పవిత్ర జీవనది కి ఇరువైపుల ఉన్న ఉభయగోదావరి జిల్లాలు 18 వ శతాబ్ది వరకు అతివృష్టి వలన, వరదముంపుకు లోనగుచు, అనావృష్టి వలన కరువుకాటకాలతో విలవిలలాడాయి. 1831-32 లో అతివృష్టి, తుపానులకు లోనయ్యింది.

1833లో అనావృష్టి వలన కలిగిన కరువు వలన 2లక్షల ప్రజలు తుడుచుపెట్టుకు పోయారు. అలాగే 1839 లో ఉప్పెన మరియు కరువు మరింతమందిని పొట్టనపెట్టుకొంది.1852లో కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట, ఉభయగోదావరి జిల్లాలలోని రైతుల, ప్రజల ఆర్థిక మరియు జీవనగతులను మార్చివేసింది. తమపాలిట దుఖఃదాయినిగా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానంతరము, పండితులు గోదావరిలో స్నానమాచరించి, లా సంకల్పం చెప్పుకుంటారు.

(మిగతా రేపు)

-నందిరాజు రాధాకృష్ణ

Leave a Reply