జమిలి ఎన్నికలు సాధ్యం కాదు: ఈసీ

జమిలి ఎన్నికలు సాధ్యం కాదు: ఈసీ
Views:
14

ఢిల్లీ, 14 ఆగష్టు:

‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తొందరపడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదే అంశంపై నిన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా లా కమిషన్‌కు లేఖ కూడా రాశారు.

ఏడాది పొడవునా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా అభివృద్ధి కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం పడుతోందని,  చాలామంది అధికారులు ఎన్నికల డ్యూటీలో గడపాల్సి రావడం వల్ల మాటామాటికీ జరుగుతున్న ఎన్నికలతో ఖర్చు పెరిగిపోతున్నదని ఆయన పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు తమ వద్ద లేవు కాబట్టి వచ్చే ఏడాది లోక్‌సభ, రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని భారత ఎన్నికల సంఘం తేల్చి చెప్పేసింది.  ఈ మేరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సరిపడినన్ని వీవీపీఏటీలు మెషీన్లు తమ వద్ద లేవని ఈసీ చీఫ్ ఓపీ రావత్ పేర్కొన్నారు. అయితే అదనపు మెషీన్ల కోసం సకాలంలో ఆర్డర్ చేయాల్సి ఉందనీ, జమిలి ఎన్నికలపై రెండు మూడు నెలల్లోగా తుదినిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.

మామాట: మొత్తానికి బీజేపీకి ఈసీ బాగానే షాక్ ఇచ్చింది…

(Visited 18 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: