మసాజ్‌ సెంటర్ల ముసుగులో సాగుతున్న వ్యభిచారం!

Share Icons:

చెన్నై నగరంలో అనుమతులు లేకుండా సాగుతున్న మసాజ్‌ సెంటర్లను పోలీసులు సీజ్‌ చేశారు. మసాజ్‌ సెంటర్లు, స్పాలలో వ్యభిచారం జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో వ్యభిచార నియంత్రణ విభాగంలో పనిచేసిన ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఏసీబీకి చిక్కారు. మసాజ్‌ సెంటర్లు, స్పాలు, స్టార్‌ హోటళ్ల నుంచి వీరు లక్షల్లో లంచం తీసుకున్నట్లు తేలింది. దీంతో ప్రత్యేక బృందాలు రెండు రోజులుగా మసాజ్‌ సెంటర్లు, స్పాలపై దృష్టి పెట్టాయి.

ఎనిమిది మసాజ్‌ సెంటర్లు ఇతర రాష్ట్రాల నుంచి యువతులు, మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. 8 మంది మహిళలకు విముక్తి కల్పించారు. నగరంలో మొత్తం 151 మసాజ్‌ సెంటర్లు, స్పాలు ఉండగా ఇందులో 63 సెంటర్లకు అనుమతులు కూడా లేవని తేలింది. ఈ సెంటర్లకు సీల్‌ వేశా రు. నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply