సరదాగా ఆట పట్టించిన శ్రేయస్‌… కార్డు పడేసి వెళ్లిన సిరాజ్‌!

Share Icons:

టీమిండియా ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాట్‌తోనే కాదు.. తనదైన ప్రత్యేకమైన ‘మ్యాజిక్‌’ నైపుణ్యాలతోనూ ఆకట్టుకోగలడు. ఇప్పటికే డ్రెస్సింగ్‌రూంలోని ఎంతో మంది క్రికెటర్లు, సిబ్బందికి తన ‘స్కిల్స్‌’ చూపించిన శ్రేయస్‌.. ఈసారి పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను టార్గెట్‌ చేశాడు. తన ‘మాయ’తో సిరాజ్‌ చేతిలో ఉన్న కార్డును మార్చేశాడు. కాగా న్యూజిలాండ్‌ను 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా రెట్టింపు ఉత్సాహంతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

నవంబరు 25 నుంచి తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు ఒక్కచోట సరదాగా గడుపుతున్న దృశ్యాలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్‌ చేసింది. తన చేతిలో ఉన్న నాలుగు కార్డు(పేక ముక్కలు)ల్లో ఒకటిని తీసుకోవాల్సిందిగా శ్రేయస్‌… సిరాజ్‌ను కోరాడు. అతడు నాలుగు నంబర్‌ ఉన్న కార్డును తీసుకుని శ్రేయస్‌కు అందించాడు. ఈ క్రమంలో రాండమ్‌గా ఓ కార్డును తీసి.. సిరాజ్‌ చేతిలో పెట్టిన శ్రేయస్‌.. కాసేపటి తర్వాత చేతిని తెరవాల్సిందిగా సూచించాడు.

అతడు చెప్పినట్లుగానే సిరాజ్‌ చేతిలో జోకర్‌ దర్శనమిచ్చింది. దీంతో అవాక్కవడం సిరాజ్‌ వంతైంది. వెంటనే కార్డును కిందపడేసి నవ్వుతూ అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయాడు. ఇక శ్రేయస్‌ మాత్రం మరింత జోష్‌గా.. ‘‘మియాన్‌ కుచ్‌ తో బోలో మియాన్‌… కుచ్‌ తో బోలో(మాట్లాడండి సర్‌.. ఏదైనా మాట్లాడండి)’’ అంటూ సరదాగా ఆటపట్టించాడు. ఇక రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌ వీరిద్దరి సంభాషణను చూస్తూ ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply