అడవులకు శర్వానంద్

Share Icons:

హైదరాబాద్, ఏప్రిల్ 20,

శర్వానంద్ కథానాయకుడిగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా నిర్మితమైంది. ఈ సినిమా టైటిల్ ను ఇంకా ప్రకటించలేదు. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, మే 31వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ’96’ రీమేక్ షూటింగులో శర్వానంద్ జాయినైపోయాడు.

శర్వానంద్ సరసన సమంత నటిస్తోన్న ఈ సినిమాకి ప్రేమ్ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా మారిషస్ లో ఒకటి రెండు రోజులు షూటింగు జరుపుకుని వచ్చింది. తాజా షెడ్యూల్ ను ‘కెన్యా’ అడవుల్లో ప్లాన్ చేశారు. త్వరలోనే ఈ సినిమా యూనిట్ అక్కడికి చేరుకోనుంది. 15 రోజుల పాటు అక్కడ ఏకధాటిగా చిత్రీకరణ జరపనున్నట్టుగా తెలుస్తోంది.

దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తమిళంలో మాదిరిగానే తెలుగులోను ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

మామాట: వేసవికి అక్కడ బాగా ఉంటుందా.. శర్వా

Leave a Reply