ఆశ్చర్యం! మూడున్నర అడుగుల పామును ఆ చేప అమాంతం మింగేసింది!

Share Icons:

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ కొన్ని వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. ఇంకొన్ని భయంకరంగా కనిపిస్తుంటాయి. నెట్టింటగ పాములకు సంబంధించిన చాలా వీడియోలను మనం చూసుంటాం. అన్ని చోట్ల పాముదే పై చేయి కనిపిస్తుంటుంది. అయితే మీరెప్పుడైనా పాముని చేప వేటాడడం చూశారా..? అదేంటి పామును ఒక చేప మింగడమా..? అని మీరు ఆశ్చర్యపోతున్నారా..? అవునండి పామును చేప వేటాడింది. అలాంటి ఒక వీడియో ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక చేప పాములాంటి జీవిని మింగడం కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతు పలు కామెంట్లు చేస్తున్నారు.

నది ఒడ్డున నీళ్లలో ఉన్న ఓ చేప, పొదల్లో నుంచి నీళ్లలో తలను పెట్టిన పామును స్లోగా మింగడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఒక్క రోజులోనే సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్‌ అవుతోంది. వేలల్లో వీక్షిస్తున్న నెటిజన్లు ఆశ్చర్యానికి గురౌతున్నారు. ఓ మై గాడ్‌..! ఇది ఎలా సాధ్యం అని ఒకరు, నా కళ్లను నమ్మలేకపోతున్నాను, ఇది నిజమేనా అని మరొకరు కామెంట్ చేశారు. మరి మీరేమంటారు..

సేకరణ :- మామాట డస్క్ (అంతర్జాల సంచికల నుండి)

Leave a Reply