అదే గనుక నిజమైతే ఇండియాలో రజనీనే తోపు….

shocking news about rajanikanth remuneration
Share Icons:

.హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ కు సౌత్ ఇండియాలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాలు అంటే తమిళ్ ఇండస్ట్రీతో పాటు తెలుగు, మలయాళం, కన్నడం అభిమానులు కూడా ఎగబడి చూస్తారు. అయితే రజనీకు సౌత్ తో పాటు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక త్వరలో రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా రిలీజ్ కానుంది. దీనికోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   తాజాగా రజనీకాంత్ రెమ్యునరేషన్ విషయం మీడియాలో సంచలనం మారింది. కబాలి, కాలా, పేట లాంటి కమర్షియల్ సినిమాల తర్వాత రజనీకాంత్ దర్బార్ సినిమా కోసం భారీగానే పారితోషికాన్ని స్వీకరించినట్టు తెలుస్తోంది.

దర్భార్ సినిమాను లైకా ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు ఏఆర్ మురగదాస్ తెరెక్కించారు. 250 కోట్ల బడ్జెట్‌తో ముంబై నేపథ్యంగా తెరకెక్కిన మాఫియా చిత్రం ఉత్తరాది, దక్షిణాదిలోని పలు ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకొన్నది. అయితే ఈ సినిమా కోసం రజనీకాంత్ రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకొన్నాడనే విషయం భారతీయ సినిమా పరిశ్రమలో సంచలనంగా మారింది. ఇదే గనుక నిజమైతే ఇండియాలోనే ఈ స్థాయిలో పారితోషికం తీసుకున్న హీరోగా రజనీకాంత్ నిలవనున్నారు.

ఇక దర్బార్ చిత్రాన్ని ప్యాన్ ఇండియా మూవీగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కబాలి, 2.0 చిత్రాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించడంతో ఇప్పుడు దర్బార్‌ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలను బట్టి హిందీలో ఏ రేంజ్ హిట్ అనేది ఆధారపడి ఉంటుంది. అటు దర్బార్ మూవీ మోషన్ టీజర్ ఇటీవలే రిలీజై మంచి క్రేజ్‌ను సంపాదించుకొన్నది. హిందీలో సల్మాన్ ఖాన్, తెలుగులో మహేష్ బాబు, తమిళంలో కమల్ హాసన్, మలయాళంలో మోహన్‌లాల్ మోషన్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ టీజర్‌లో రజనీకాంత్ స్టయిల్ ఎప్పటిలానే అభిమానులను, ప్రేక్షకులను ఆలరించింది. దీంతో ట్రైలర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఇక దర్బార్ సినిమా విషయానికి వస్తే.. రజనీకాంత్ ఈ చిత్రంలో రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో కనిపించనున్నారు. ఒకటి పోలీస్ ఆఫీసర్ పాత్ర కాగా, మరోటి సామాజిక కార్యకర్త. ఈ చిత్రంలో రజనీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ చిత్రంలో నివేదా థామస్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

,

Leave a Reply