ఈవీఎంలపై శివసేన సంచలన వ్యాఖ్యలు…

shivsena again gave a shock to the bjp party
Share Icons:

ముంబయి, 11 ఫిబ్రవరి:

ఇప్పటికే ఈవీఎంలని బీజేపీ ట్యాపరింగ్ చేస్తుందని, బ్యాలెట్ విధానంలో వచ్చే ఎన్నికలని నిర్వహించాలని ప్రతిపక్ష పార్టీలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.  ఇక దేనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్ష పార్టీగా వ్యవహరిస్తున్న శివసేన పార్టీ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియాలో వాడుతున్న ఈవీఎంలనే వాడుతూ ఎన్నికలు పెడతే లండన్, అమెరికాల్లోనూ బీజేపీ గెలుస్తుందని తమ అధికార ‘సామ్నా’ పత్రిక సంపాదకీయంలో తెలిపింది.

బీజేపీ ఓవర్ కాన్ఫిడెన్స్ త్వరలోనే కనుమరుగై, అసలు నిజం తెలిసివస్తుందని ఎద్దేవా చేసింది.  అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని దేశ ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించింది. గడచిన లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 43 గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, రానున్న ఎన్నికల్లో ఈ నంబర్ ఎంత తగ్గుతుందో చెప్పలేమని పేర్కొంది.

గత ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచిన మహారాష్ట్ర వాసులు, ఇప్పుడు పురాలోచించుకుంటున్నారని, ఇప్పటికీ మేల్కొపోతే స్నేహితులుగా ఉన్నవారంతా దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించింది.

మామాట: మొత్తానికి మిత్రపక్షానికి కూడా ఈవీఎంలపై అనుమానం ఉంది…

 

Leave a Reply