మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డ శివసేన…

shivsena party fires on central government
Share Icons:

ముంబయి, 10 జనవరి:

బీజీపీకి మిత్రపక్షంగానే కొనసాగుతూ…శివసేన ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా శివసేన మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడింది.  బుధవారం శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే…కరవుతో అల్లాడుతున్న మహారాష్ట్రలోని మూడు మరాఠ్వాడా జిల్లాల్లో పర్యటించి అక్కడ రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూటమి గురించి మాట్లాడుతున్న మహారాష్ట ప్రభుత్వం తొలుత రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ వ్యవస్థ మన్నుతిన్న పాములా తయారైందని, దానిని తట్టి లేపాల్సిన అవసరం ఉందని, తనకి ‘మన్‌కీ బాత్’ అవసరం లేదని, తాను ‘జన్‌కీ బాత్’నే వింటానని మోదీపై పరోక్ష విమర్శలు చేశారు.

అయితే రైతు సమస్యలను పరిష్కరించకుండా తమతో కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. రైతు సమస్యలు, రామ మందిర నిర్మాణం వంటి వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విపలమైందన్నారు. అసలు కోర్టు తీర్పుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణం వంటి హామీలను ఎందుకు ఇచ్చారని బీజేపీని సూటిగా ప్రశ్నించారు.  

మామాట: విమర్శలు చేస్తారు…అవసరమైనప్పుడు సపోర్ట్ చేస్తారు…

Leave a Reply