2019లో హాంగ్ ఏర్పడాలని గడ్కరీ కోరుకుంటున్నారు: శివసేన

Nitin gadkari said a shocking news to telangana
Share Icons:

ముంబయి, 7 జనవరి:

2019 లోక్‌సభ ఎన్నికల గురించి శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్…ఆ పార్టీ సొంత పత్రిక సామ్నాకు రాసిన సంపాదకీయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రెండోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కాకుండా రాజకీయ కుట్ర జరిగిందని వ్యాఖ్యానించారు. 2019లో హంగ్ లోక్ సభ ఏర్పడాలని గడ్కరీ కూడా కోరుకుంటున్నారని, ఒకవేళ హంగ్ ఏర్పడితే… అత్యున్నత పదవిని (ప్రధాని) ఆయన చేపట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. 

ప్రధాని మోదీ ప్రాభవం నానాటికీ తగ్గుతోందని… ఇదే సమయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రోజురోజుకూ బలపడుతున్నారని ఆయన తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో అస్పష్టమైన ప్రజాతీర్పు వెలువడబోతోందని… దీనికి కారణం మోదీనే అని సంజయ్ అన్నారు.

2014లో కాంగ్రెస్ ను ఓడించాలనే భావనతో ఆనాడు మోదీకి ప్రజలు మద్దతు పలికారని… కానీ, ఇప్పడు పరిస్థితి మొత్తం మారిపోయిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుందనే ఆందోళనలో ఆ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారని… ఇటీవల నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని చెప్పారు. అందుకే ప్రత్యామ్నాయ నేతగా గడ్కరీని అంగీకరించేందుకు ఆరెస్సెస్, ఇతర బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారని సంజయ్ తెలిపారు.

మామాట: అంటే మీరంతా గడ్కరీని ప్రధానిని చేసే పనిలో ఉన్నారుగా..

Leave a Reply