బీజేపీపై మరోసారి ఫైర్ అయిన శివసేన…

shivsen fires again bjp party
Share Icons:

ముంబై, 2 నవంబర్:

మహారాష్ర్రలోనూ, కేంద్రంలోనూ బీజేపీ-శివసేన భాగస్వామ్య పార్టీలుగా ఉన్నప్పటికీ పలు అంశాలపై బీజేపీతో శివసేన తరచు విభేదిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే బీజేపీపై శివసేన మరోసారి ఫైర్ అయింది. అయోధ్యలో రామాలయం నిర్మిస్తామంటూ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే 2019 ఎన్నికల్లో బీజేపీ బలం 280 లోక్‌సభ సీట్ల నుంచి మళ్లీ 2 సీట్లకు పడిపోవడం ఖాయమని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాకరే అన్నారు.

రాయ్‌గఢ్ జిల్లా మహద్‌లో జరిగిన కార్యక్రమంలో శివసేన కార్యకర్తలను ఉద్దేశించి థాకరే మాట్లాడుతూ, 2014లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ విపక్షాలు తరచు బీజేపీని తప్పుపడుతున్నాయని అన్నారు.

2019 ఎన్నికలు తరుముకొస్తున్నాయని,  2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ద్రవ్యోల్బణం తగ్గలేదని, ఉద్యోగిత పెరగలేదని,  విచిత్ర పరిస్థితిని దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఇక ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే ఓట్లు రాబట్టుకోలేమని అన్నారు. కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్న రాష్ట్రంలో తాను పర్యటిస్తుంటే, ప్రధాని మాత్రం విదేశీ పర్యటనలతో బిజీగా ఉన్నారని థాకరే విమర్శించారు. మహారాష్ట్రలో ఈసారి శివసేన ముఖ్యమంత్రి ఉండాలని, అందుకోసం తాను రాష్ట్రమంతంటా పర్యటిస్తానని థాకరే అన్నారు.

మామాట: కలిసే ఉంటారు..విమర్శిస్తారు..ఏంటో ఈ  వింత పరిస్థితి….

Leave a Reply