కోటప్పకొండపై శివరాత్రి సందడి

కోటప్పకొండపై శివరాత్రి సందడి
Views:
5

కోటప్పకొండపై శివరాత్రి సందడి

కోట‌ప్ప‌కొండ‌, ఫిబ్ర‌వ‌రి 13ః

భక్తకోటితో గుంటూరు జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం కోటప్పకొండ కిటకిటలాడుతోంది. తెల్లవారుజామున 2 గంటలకు తొలిపూజ అనంతరం 3 గంటల నుంచి భక్తులకు దైవదర్శనానికి అనుమతినిచ్చారు.

దీంతో పెద్దఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17వ తేదీన కోటప్పకొండలో పర్యటిస్తారని, పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారని స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు తెలిపారు.

సోమవారం కోటప్పకొండలో సౌండ్‌ అండ్‌ మ్యూజిక్‌, రోప్‌వే శంకు స్థాపన చేసే ప్రాంతం, చిలకలూరిపేట రోడ్డులోని హెలిప్యాడ్‌, కాకాని వద్ద జేఎన్‌టీయూకేకి కేటాయించిన స్థల పరిశీలన, అక్కడ ఏర్పాటు చేసే హెలిప్యాడ్‌ తదితర ఏర్పాట్లను కోడెల పరిశీలించారు.

ఈ సందర్భంగా స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ కోటప్పకొండలో రూ.7 కోట్లు వ్యయంతో నిర్మించే రోప్‌వేకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

కొండపైకి వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని త్రికోటేశ్వరుని దర్శిం చుకుంటారన్నారు.

జేఎన్‌టీయూకే కళాశాల నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన 86 ఎకరాల్లో రూ.80 కోట్లతో నిర్మించే భవన సముదాయానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు.

అనంతరం జరిగే సభలో ప్రసంగిస్తారన్నారు. కొండపై పర్యాటక కేంద్రం వద్ద అభివృద్ధి పనులను కలెక్టర్‌ కోన శశిధర్‌, రూరల్‌ ఎస్పీ సీహెచ్‌ వెంకట అప్పలనాయుడు, జేసీ -2 వెంకటేశ్వరరావులతో చర్చించారు.

ఈ సందర్భంగా త్రికోటేశ్వరుని దర్శనం కోసం వచ్చిన ముస్లిం మహిళలతో స్పీకర్‌ డాక్టర్‌ కోడెల, కలెక్టర్‌, ఎస్పీ తదితరులు ముచ్చటించారు.

మామాటః ర‌వాణా సౌక‌ర్యాలు పెరిగితే కోట‌ప్ప‌కొండ మ‌రింత అభివృద్ధి చెందుతుంది.

 

English Summery: Noted pilgrim center Kotappakonda in Guntur District folded with devotes on the occasion of   Maha Shivaratri. Andhra Pradesh Chief Minister N.Chandrababu Naidu is going to visit the temple tomorrow, the Speaker of AP assembly Kodela Shivaprasadararao said today.

Related posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *