రాహుల్, ప్రియాంకలు ఎన్నికల్లో చాలా కష్టపడ్డారు: శివసేన

shivsena-party-sensational-comments-about-2019-elections
Share Icons:

ముంబై, 21 మే:

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ చాలా కష్టపడ్డారని శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో కథనంలో తెలిపింది. అయితే వారికి గతంలో కంటే ఎక్కువ సీట్లు అంటే…లోక్ సభలో ప్రతిపక్ష పార్టీ హోదా పొందేందుకు అవసరమైన సీట్లు కాంగ్రెస్‌కు వస్తాయని తెలిపింది.

అయితే మోడీ మరోసారి ప్రధాని అవుతారని చెప్పడానికి రాజకీయ పండితులు అవసరం లేదని శివసేన వ్యాఖ్యానించింది. మోడీని మళ్లీ ప్రధానిని చేయాలనే నిర్ణయానికి ప్రజలు ఎప్పుడో వచ్చేశారని చెప్పింది.

అలాగే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ల్లో బీజేపీకి మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పింది.

ఇటు మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి అత్యధిక సీట్లు కైవసం చేసుకుంటుందని తెలిపింది. అయితే ఎగ్జిట్ పోల్స్ కంటే…కచ్చితమైన ఫలితాల కోసం 23వ తేదీ వరకు వేచి చూడటం మంచిదని వ్యాఖ్యానించింది.

మామాట: పొగిడారా సెటైర్ వేశారా

Leave a Reply