బంగ్లాదేశ్ ఎన్నికలు..మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న షేక్ హసీనా…

Share Icons:

ఢాకా, 31 డిసెంబర్:

బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి మూడోసారి  అధికారాన్ని చేజిక్కించుకున్నారు షేక్ హసీనా…మొత్తం 298 సీట్లకు జరిగిన ఎన్నికల్లో 287 స్థానాలను సాధించిన హసీనా సారథ్యంలోని అవామీ లీగ్ పార్టీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

అయితే 2014 ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)కి ఈసారి 6 సీట్లు మాత్రమే గెలవడం గమనార్హం. కానీ ఈ ఎన్నికల్లో పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక హింసాత్మకంగా మారిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో వివిధ ప్రాంతాల్లో 17 మంది మృతి చెందారు. వీరిలో అధికార అవామీ లీగ్‌ యూత్ విభాగమైన జుబో లీగ్ జనరల్ సెక్రటరీ మహ్మద్ బషీరుద్దీన్ కూడా ఉన్నారు.

అధికార, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎక్కువ మంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు.

మామాట: మొత్తానికి షేక్ హసీనా హ్యాట్రిక్ కొట్టారు…

Leave a Reply