మళ్ళీ మోదీ ప్రధాని అయ్యే అవకాశం లేదు: శరద్ పవార్

sharad pawar comments on pm modi
Share Icons:

ముంబై, 23 అక్టోబర్:

వచ్చే ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదని, అలాగే నరేంద్రమోదీ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశం లేదని ఎన్సీపీ అధినేత, మాజీ కేంద్రమంత్రి శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ముంబైలో ఆజ్ తక్ నిర్వహించిన ముంబై మంథన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ….వచ్చే ఎన్నికలు 2004 నాటి రాజకీయ పరిస్థితులు పునరావృతం కావొచ్చని జోస్యం చెప్పారు. మహారాష్ట్ర, కేంద్రంలోనూ పరిస్థితులు మారతాయని అన్నారు.

అయితే బీజేపీలో వాజ్‌పేయితో పోల్చదగిన నాయకులెవ్వరూ ప్రస్తుతం లేరని అన్నారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించబోమన్న చిదంబరం వ్యాఖ్యలపై స్పందించిన పవార్… చిదంబరం నిజం చెప్పారని తెలిపారు. తాను కాంగ్రెస్ నాయకత్వంతో మాట్లాడిన సందర్భంలోనూ వారు ఇదే విషయాన్ని వెల్లడించారని పవార్ వివరించారు.

ఇక కేంద్రంలో బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడే పరిస్థితులు లేవని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉంటాయని అన్నారు. రాష్ట్రస్థాయిలో కూటములు ఉండొచ్చని తెలిపారు. కాకపోతే ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కలసి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని పవార్ జోస్యం చెప్పారు.

మామాట: పవార్ జోస్యం నిజం అవుతుందా….!

Leave a Reply