శక్తిమేర ఆడితే భారత్‌పై నెగ్గడం సాధ్యమే: షకీబ్

Share Icons:

లండన్, 26 జూన్:

ప్రపంచ కప్‌లో పసికూనగా అడుగుపెట్టి బంగ్లాదేశ్ అద్భుతంగా రాణిస్తుంది. ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడి మూడింట్లో గెలిచి, ఒక మ్యాచ్ టై, మూడు మ్యాచ్‌లో ఓడిపోయి 7 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే సెమీస్‌కు చేరే అవకాశం ఉంది.

అయితే అందులో ఒకటి ఇండియాతో తలపడాలి. జూలై2న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత్‌తో జరిగే మ్యాచ్ గురించి ఆ జట్టు ఆల్ రౌండర్…షకీబ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తే.. భారత్‌ను ఓడించే సత్తా బంగ్లాదేశ్‌కు ఉందని అన్నాడు. టైటిల్ ఫేవరెట్ టీమ్‌ఇండియాపై గెలువాలంటే జట్టులోని ఆటగాళ్లందరూ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. టైటిల్‌పై కన్నేసిన భారత్.. అగ్రశ్రేణి జట్టు. కోహ్లీ సేనను ఓడించడం అంత తేలిక కాదు.

కానీ మా వంతు ప్రయత్నం చేస్తాం. శక్తిమేర ఆడితే భారత్‌పై నెగ్గడం సాధ్యమే. ఒంటిచెత్తో మ్యాచ్‌ను గెలిపించగలవారు టీమ్‌ఇండియాలో చాలా మంది ఉన్నారు. అనుభవాన్ని నైపుణ్యాన్ని సరిగ్గా వినియోగించుకుంటే.. వారిని ఓడించగలిగే జట్టు మాకూ ఉంది అని షకీబ్ వివరించాడు.

ఇక రేపు భారత్-వెస్టిండీస్‌ల మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. అయితే  పాకిస్థాన్ మ్యాచ్ లో గాయపడిన పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. ఫిజియో పర్యవేక్షణలో భువీ దాదాపు 30 నిమిషాలపాటు బౌలింగ్‌ చేశాడు. అతడి బౌలింగ్‌ తీరు చూస్తే గాయం నుంచి కోలుకున్నట్టుగా కనిపించాడు. కానీ విండీ్‌సతో మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడా? లేదా అనే విషయం తెలియరాలేదు.

Leave a Reply