కశ్మీర్ విభజనపై భారత్ పై అక్కసు వెళ్లగక్కిన అఫ్రిది…

shahid afridi comments on jammu kashmir division
Share Icons:

ఇస్లామాబాద్:

 

ఎప్పుడు ఏదొక సందర్భంలో ఇండియాపై విషం కక్కే…..పాకిస్తాన్ క్రికెటర్ అఫ్రిది…మరోమారు తన అక్కసు అంతా వెళ్ళగక్కాడు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, భారత ప్రభుత్వ చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు.

 

ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా కశ్మీరీ ప్రజలకు భారత ప్రభుత్వం కనీస హక్కులు ఇవ్వడం లేదని, అసలు ఐరాస ఏర్పాటు ఎందుకు జరిగిందో తెలియడం లేదని అన్నారు. హక్కుల ఉల్లంఘన ఈ స్థాయిలో ఉన్నా, ఐరాస నిద్రపోతోందని ఆరోపించారు. కశ్మీరీల హక్కుల ఉల్లంఘనపై ఎందుకు ఐక్యరాజ్యసమితి స్పందించట్లేదని ప్రశ్నించారు.

 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని అఫ్రీది కోరాడు. తాను పెట్టిన ట్వీట్ ను యూఎన్ఓ, డొనాల్డ్ ట్రంప్‌ కు ట్యాగ్ చేశాడు.

 

అటు ఇండియా ప్రభుత్వ వైఖరి, ఆ దేశ సైనికుల దాష్టీకాలతో ఇబ్బందులు పడుతున్న కాశ్మీర్ ప్రజలకు తమ దేశం అండగా నిలబడుతుందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 రద్దును ఓ తప్పుడు నిర్ణయంగా ఆయన అభివర్ణించారు. దీంతో కశ్మీర్ సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తే, అది అత్యాశే అవుతుందన్నారు. కాగా, తాజా పరిస్థితులపై చర్చించేందుకు పాకిస్థాన్ పార్లమెంట్ నేడు ప్రత్యేకంగా సమావేశం కానుంది. కశ్మీరీలకు మద్దతివ్వాలని ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని ఆమోదించవచ్చని సమాచారం

Leave a Reply