కేర‌ళ నుంచి సెక్స్ బానిస‌లు!

Share Icons:

కేర‌ళ నుంచి సెక్స్ బానిస‌లు!

వెలుగులోకి వ‌స్తున్న దారుణ క‌థ‌నాలు

ఒక‌ళ్లు కాదు… ఇద్ద‌రు కాదు… దాదాపు 90 మంది యువ‌తులు మోస‌పు పెళ్లికి బ‌లై సిరియాలో ఉగ్ర‌వాదుల‌కు ఉంపుడుక‌త్తెలుగా మారారు.

వీరంతా కేర‌ళ‌కు చెందిన వారు. తాజాగా ఒక కేసు బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ భాగోత‌మంతా బ‌య‌ట‌ప‌డింది.

యువ‌తుల‌ను ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి వారిని పెళ్లి పేరుతో వ‌ల‌లో వేసుకునే ముఠా ఒక‌టి కేర‌ళ‌లో విస్తృతంగా ప‌ని చేస్తున్న‌ది.

కేర‌ళ పోలీసులు ఇచ్చిన వివ‌రాల‌ను ఎన్ఐఏ ఇప్పుడు నిశింతంగా ప‌రిశీలిస్తున్న‌ది. కేర‌ళ‌లో పుట్టి గుజ‌రాత్‌లో పెరుగుతున్న ఒక 25 ఏళ్ల ఒక యువ‌తిని మ‌హ్మ‌ద్ సియాద్ అనే వాడు ప్రేమ‌లోకి దించాడు.

ఆమెను త‌న స్నేహితుల‌కు ప‌రిచ‌యం చేశాడు. అంద‌రూ క‌లిసి ఆ అమ్మాయిపై అత్యాచారం చేశారు.

వాటిని వీడియో చిత్రీక‌ర‌ణ చేశారు. ఆ వీడియోల‌ను చూపించి బెదిరించి ఆ అమ్మాయిని ఉగ్ర‌వాదుల‌కు అమ్మేశారు.

ర‌షీద్ అనే వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయికి న‌కిలి ఆధార్ కార్డు సృష్టించి దాంతో దొంగ పాస్‌పోర్టు సంపాదించారు.

ఈ మొత్తానికి ర‌షీద్ అనే వాడికి సౌదీ నుంచి డ‌బ్బులు వ‌చ్చాయి. 2017 ఆగ‌స్టులో ఆ అమ్మాయిని జ‌డ్డాకు తీసుకువెళ్లారు.

అక్క‌డ నుంచి ఐఎస్ ఐ ఉగ్ర‌వాదుల‌కు సెక్స్ బానిస‌గా అమ్మేశారు. అయితే ఆ అమ్మాయి ఎలాగోలా త‌ప్పించుకుని మ‌ళ్లీ ఇండియా వ‌చ్చేసింది.

పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేర‌ళ పోలీసులు ఆరా తీస్తే ఇలాంటి కేసులు చాలా దొరికాయి.

ఒక్కో కేసును ఎన్ ఐ ఏకు అందిస్తున్నారు. ఎన్ ఐ ఏ వారు ఈ కేసుల‌న్నింటిని కూలంక‌షంగా ద‌ర్యాప్తు చేస్తున్నారు.

అమ్మాయిల‌కు మోసం జ‌ర‌గ‌డ‌మే కాకుండా కోట్లాది రూపాయ‌ల సొమ్ము చేతులు మారుతున్న‌ది.

అత్యంత గౌర‌వంగా బ‌త‌కాల్సిన ఆడ పిల్ల‌లు ఉగ్ర‌వాదుల‌కు సెక్స్ బానిస‌లుగా మారుతున్నారు.

అందుకే ఎన్ ఐ ఏ ఇలాంటి కేసుల‌ను ఆమూలాగ్రం ప‌రిశోధించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న‌ది.

మామాటః ఉగ్ర‌వాదుల‌కు సెక్స్ బానిస‌లుగా అమ్మ‌తున్న‌వారిని క‌ఠినంగా శిక్షించాలి.

English Summary: NIA has been examining what it calls a pattern of forcible conversions in Kerala. Ninety such cases were referred to NIA by Kerala police last year.

Leave a Reply