పోల్ నెం. 19 – సర్వే జంతర్ మంతర్

Share Icons:

ఆ పార్టీకి ఇన్ని సీట్లు! – ఈ పార్టీకి కొన్నే సీట్లు!
అంటూ తనకు కావలసిన వారికి తీపి కబురు వంటి సర్వే స్వీట్లు పంచుతున్న మీడియా వర్గాలపై ప్రజల్లో అసహనం వ్యక్తమౌతోంది.

 

[pinpoll id=”58020″]

 

…. కుర్రో కుర్రు.. అంబ పలుకు జగదాంబ పలుకు అంటూ గతంలో గ్రామాలలో ఇళ్లిల్లూ తిరిగి సోది చెప్పేవారుండే వారు.
తరువాత చిలకజోష్యం, గవ్వ జోష్యాలు, పిల్లి, ఎలుక, పేకముక్కల జోష్యాలు వచ్చినై, ఇవన్నీ ఒక ఎత్తు. ఏదో బీదప్రజలు తమ పొట్టకూటికోసం, పూటగడవడంకోసం ఈ హస్త సాముద్రికం, చిలకజోష్యం చెప్పుకుని జీవనం సాగించేవారు.

అయితే, ఇపుడు నడుస్తున్న ట్రెండు వేరు. ప్రముఖ మీడియా సంస్థలే పాలకులకు కావలసిన రీతిలో ఫలితాలను సిద్ధం చేస్తున్నాయి. ఇది కూడా పాత విధానమే.. ఎందుకంటే, ఉగాది రోజున ఏ పార్టీ ఆఫీసులో పంచాంగం చదివితే ఆ పార్టీకి తిరుగులేదు అన్న రీతిలో చిలక పలుకులు పలికిన వారే ఈ నయా సర్వేలకు మార్గదర్శకులనవచ్చు. ఏ గూటి చిలుక ఆ పాట పాడుతుందన్నది నిజం.

ఇక తాజా సర్వేలకు వద్దాం. ఒక్కో పత్రిక, ఒక్కో టీవీ రోజుకొక్క సర్వేని వండి జనం మీదకు వదులుతోంది.

ఒకానొక సమయంలో ఒక అంశంపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం – సర్వే

దీనినే జనాభిప్రాయం, ప్రజాభిప్రాయ సేకరణ అంటూ ఉంటారు. సర్వేలో భాగంగా ప్రశ్నావళి ఉంటుంది. దీని ఆధారంగానే సమాధానాలుంటాయి. కోర్టులో కేసు వాదించే లాయర్ గారు తన కక్షిదారుని, సాక్షినుంచీ తనకు కావాల్సిన సమాధానాలు రాబట్టే ప్రశ్నలే వేస్తాడు. గుర్తుందా, ఎన్ని తెలుగు సినేమాలు చూడలేదు మనం…!

ఈ సర్వేలూ అంతే, వాటికి కావలసిన సమాధానం వచ్చే ప్రశ్నలు వేస్తారు… అదిగో జవాబు వచ్చేసిందని మనలను ఎక్స్లూజివ్ గా ఊదరగొడుతుంటారు. అదంతా ఓ మాయా ప్రపంచం. ఇక ప్రజలంటారా, ఏ టీవీ లోగో కనిపిస్తే దానికి అనుకూలంగా మాట్లాడేస్తుంటారు. లేకపోతే, ఎడిటింగులో కట్ అయిపోతామనీ, తెరమీద కనిపించమనీ వారికీ తెలుసు కదా, ఓటు ఎవరికి వేస్తామో ఎవరు చూస్తారు, ఇపుడు టీవీలో కనిపించే ఛాన్సు ఎందుకు వదులుకోవాలనే అల్పసంతోషులు వారు. లేకపోతే తల పగిలిపోయే సినిమా చూసి వస్తూ… ఆ సూపర్, బ్రహ్మాండం, వందరోజులు గ్యారెంటీ అనే వారిని మనం ఎంత మందిని చూడలేదు….

ఇంతకీ, ఇట్లా వాస్తవాలకు విరుద్దుంగా, అశాస్త్రీయంగా చేపడుతున్న తాజా సర్వేలన్నీ ప్రజలపై ప్రభావం చూపుతాయా? గెలుపు గుర్రాలను నిర్ణయిస్తాయా? విశాల ప్రజా ప్రయోజనాలను ప్రతిబింబిస్తాయంటారా? ఇంతకీ ఎవరు ఈ సర్వే చేస్తున్నారు.  వారి ప్రామాణికత ఏమిటి?  అన్నది ఎవరు నిర్ణయిస్తున్నారు. తగిన సాధన సంపత్తి, శిక్షణ లేకుండా సర్వే నిర్వహించడం వలన ప్రయోజనం ఉంటుందా? సర్వే కోసం ఎంచుకుంటున్న వారు ఎవరు, వారి విశ్వసనీయత కూడా సర్వే ఫలితాలను ప్రభావితం చేస్తుంది కదా.  అయితే, తాజాగా మీడియోలో వరుసగా వస్తున్న సర్వేలలో నిజాయితీ శాతం ఎంత ఉందో నిర్ణయించేది ఎవరు?

లేకపోతే, ఏదో మన ప్రయత్నం మనం చేద్దాం, ఓటర్లు వారికి కావలసిన వారికి వారు ఓట్లు వేసుకుంటారు. మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనే భావం మీడియోలో పెరుగుతోందా! ఏ మంటారు?

 

 

మామాట: అంతే, ఏ సీసాలో పోస్తే ఆ సారా అంటారా..!

Leave a Reply