ఎన్టీఆర్‌కు సెన్సార్ మెలిక…

Share Icons:

హైదరాబాద్, 3 జనవరి:

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ ప్రధాన పాత్రలో, క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడుగా రెండు భాగాలుగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇందులో కథానాయకుడు జనవరి 9న, మహానాయకుడు ఫిబ్రవరి 7న విడుదల కానున్నాయి..

ఈ నేపథ్యంలోనే సెన్సార్ బోర్డు పెట్టిన మెలిక ఎన్టీఆర్ బయోపిక్‌కు విఘాతంగా మారింది. జీవిత చరిత్ర నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుండటంతో… పాత్రలకు సంబంధించిన వ్యక్తులు బతికి ఉంటే… వారి వద్ద నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకువాలన్నదే ఆ మెలిక. 

అయితే కథానాయకుడు చిత్రం ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి సంబంధించింది కావడంతో… దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మహానాయకుడు చిత్రం రాజకీయ నేపథ్యంలో కొనసాగనుండటంతో, ఎన్ఓసీ తీసుకురావడానికి కొంత ఇబ్బంది ఎదురుకావచ్చు.

మరోవైపు, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మాత్రం సెన్సార్ బోర్డు కండిషన్ పెద్ద సవాల్ గా మారనుంది. ఈ చిత్రంలో ఉన్న పాత్రలకు సంబంధించిన వ్యక్తుల నుంచి చిత్ర యూనిట్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా తీసుకొస్తుందా? అన్నదే ఇప్పడు హాట్ టాపిక్. 

మామాట: సెన్సార్ భలే మెలిక పెట్టిందే

Leave a Reply