ప్రియాంక హత్య విషయంలో వెలుగుచూసిన సంచలన సంఘటనలు

sensational issues out for priyanka reddy murder
Share Icons:

హైదరాబాద్: డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య, అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఇక దీనిపై పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ హత్యాచారం ఘటనలో మరికొన్ని విస్తుగొలిపే వాస్తవాలు బయటకొచ్చాయి.

అసలు పంక్చర్ చేయిస్తానని స్కూటీని తీసుకెళ్లిన నిందితుడి కోసం బాధితురాలు వేచి చూస్తుండగా మిగతా నిందితులైన మహ్మద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్‌లు ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రదేశానికి లాక్కెళ్లారు. షాక్ నుంచి తేరుకున్న వైద్యురాలు ‘హెల్ప్.. హెల్ప్’ అని పలుమార్లు అరిచింది. కాకపోతే, వాహనాల శబ్దం కారణంగా ఆమె అరుపులు ఎవరికీ వినిపించలేదు. నోరునొక్కి నిర్మానుష్య ప్రదేశానికి ఆమెను లాక్కెళ్లిన కాసేపటికే స్కూటీ తీసుకెళ్లిన నిందితుడు కూడా వచ్చి వారికి జతకలిశాడు.

అయితే అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న నిందితులు బాధితురాలు ప్రతిఘటించకుండా ఉండేందుకు బలవంతంగా ఆమె నోరు తెరిచి మద్యం పోశారు. దాదాపు 45 నిమిషాలపాటు ఆమెను చిత్రహింసలకు గురిచేసిన నిందితులు ఆ తర్వాత ముక్కు, నోరు మూయడంతో ప్రాణాలు కోల్పోయింది.

అంతేకాదు, పోలీసులు వెల్లడించిన మరో విషయం గగుర్పాటుకు గురిచేస్తోంది. మృతదేహాన్ని లారీలో తరలిస్తున్న క్రమంలోనూ పలుమార్లు దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపారు. మృతదేహాన్ని లారీలోకి ఎక్కించే క్రమంలో ప్యాంటు లేదని, ఆ తర్వాత ఓ నిందితుడు కిందికెళ్లి ప్యాంటు తెచ్చి తొడిగినట్టు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి పోలీసులు లోదుస్తులు, పర్సు, చెప్పులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

ఇక ఈ ఘటన మరవకముందే శంషాబాద్ లో మరో దారుణ ఘటన జరిగింది. ఓ మహిళను హత్య చేసి తగులబెట్టారు. సిద్దులగుట్టకు సమీపంలోని ఓ ప్రధాన రోడ్డుకు పక్కనే అయ్యప్పస్వామి గుడి ఉంది. ఆ గుడి పక్కనే వున్న స్థలంలో గుర్తుతెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి తగులబెట్టారు. పూజల నిమిత్తం గుడికి వచ్చిన అయ్యప్ప దీక్షాపరులు ఈ సంఘటనను గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

Leave a Reply