దృఢ సంకల్పం

Share Icons:

దృఢ సంకల్పంతో  సాధించలేనిది  లేదు:

దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం సత్ఫలితాలను ఇస్తాయి ! ఏకాగ్రత పెంపొందేకొద్దీ ఎక్కువ విజ్ఞానం ఆర్జించవచ్చు. ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. సాధనలో అమలుకావాలంటే ధృఢ సంకల్పం ఉండాలి. దీక్ష, పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే మనం సాధించలేనిది  లేదు. లక్ష్య సిద్ధికి దృఢ సంకల్పం ముఖ్యం. సంకల్పం ఉంటే విజయానికి అవసరమైన ఇతర లక్షణాలు వాటంతట అవే  వృద్ధి చెందుతాయి. ముందుగా ఆశావాదాన్ని  అలవరచుకోవాలి. ఆలోచనలన్నీ నిర్మాణాత్మకంగా ఉండాలి. విజయానికి మూలం దృఢ సంకల్పం. దృఢ సంకల్పం కలిగిన వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ, ఏ క్షేత్రంలోనూ అపజయం లేదు. ఏదైనా సాదించాలి అనే దృఢ సంకల్పం – అది సాధించగలమనే నమ్మకం చాలు జీవితంలో ఎన్ని కష్టమైన లక్ష్యాలనైనా సాధించడానికైనా వ్యక్తికి కావలసిన అన్ని వనరులను సమకూరుస్తుంది. మనిషిలో సుగుణాలున్నాయి, దుర్గుణాలూ ఉన్నాయి, బలము ఉంది, బలహీనత ఉంది. దృఢత్వం ఉంది. పిరికితనం ఉంది. విశ్వాసం ఉంది. సందేహం  ఉంది.

ధర్మంకోసం, శీలం కోసం, ఇతరులకు సేవకోసం అనుభవించే కష్టంలోనే సుఖానుభవం పొందిననాడు శక్తి ఉత్పన్నమౌతుంది. కర్తవ్యం ఆచరించడమే ధర్మం అని మనస్ఫూర్తిగా అనుకోగలిగినప్పుడే  దృఢ నిశ్చయం శక్తి వికసితమౌతుంది. శీలవంతుడైన వ్యక్తి పర్వతంలా దృఢంగా ఉంటాడు. అతని దృష్టిలో   సిద్ధాంతానికి, శీలానికి మాత్రమే విలువుంది. ప్రపంచంలోని ధన, ధాన్య, సౌభాగ్యాల కోసం ఎవరూ శీలాన్ని బలిపెట్టరు. విజయం అందులోనే ఆస్వాదిస్తారు.  జీవితాన్ని గంగలాగా పవిత్రంగా, నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దృఢత్వమే మనిషిని లేపి నిలబెట్ట గలుగుతుంది. శీలవంతుడైన వ్యక్తులు పర్వతంలా దృఢంగా ఉంటారు. వారి దృష్టిలో సిద్ధాంతానికి, శీలానికి మాత్రమే విలువుంది. ప్రపంచంలోని ధన, ధాన్య, సౌభాగ్యాల కోసం అతడు శీలాన్ని బలిపెట్టడు. అతడి విజయం అందులోనే ఉంది. అతడే దృఢ సంకల్పవంతుడు, అజేయుడు.

విజయానికి మూలం దృఢ సంకల్పం. అన్ని గుణాలు ఒకవైపు, దృఢ సంకల్పం ఒక్కటీ ఇంకొక వైపు. దృఢ సంకల్పం కలిగిన వ్యక్తికి జీవితంలో ఎప్పుడూ, ఏ క్షేత్రంలోనూ అపజయం లేదు. ఏదైనా సాదించాలి అనే దృఢ సంకల్పం – అది సాధించగలమనే నమ్మకం చాలు జీవితంలో ఎన్ని కష్టమైన లక్ష్యాలనైనా సాధించడానికైనా ఆ అపై ప్రకృతే వ్యక్తికి కావలసిన అన్ని వనరులను సమకూరుస్తుంది. మనిషిలో సుగుణాలున్నాయి, దుర్గుణాలూ ఉన్నాయి, బలమున్నది, బలహీనత ఉంది. దృఢత్వం ఉంది. పిరికితనం ఉంది. విశ్వాసం ఉంది. సందేహం  ఉంది.  ధర్మంకోసం, శీలం కోసం, ఇతరులకు సేవకోసం అనుభవించే కష్టంలోనే సుఖానుభవం పొందిననాడు శక్తి ఉత్పన్నమౌతుంది.

ఆశ, లోభత్వం, మొదలైనవి తలెత్తుతున్నప్పుడే వాటిని తిరస్కరించాలి. కర్తవ్యం ఆచరించడమే  ధర్మం అని మనస్ఫూర్తిగా అనుకోగలిగినప్పుడే  దృఢ నిశ్చయం శక్తి వికసితమౌతుంది.  శీలవంతుడైన వ్యక్తి పర్వతంలా దృఢంగా ఉంటాడు. అతని దృష్టిలో   సిద్ధాంతానికి, శీలానికి మాత్రమే విలువుంది. ప్రపంచంలోని ధన, ధాన్య, సౌభాగ్యాల కోసం  తన శీలాన్ని బలిపెట్టడు. విజయం అందులోనే ఆస్వాదిస్తాడు.  జీవితాన్ని గంగలాగా పవిత్రంగా, నిర్మలంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. దురాలోచనలు రాకుండా ప్రయ్యత్నించాలి. జీవితంలోఎప్పుడూ బద్ధకం, సందేహం, భయం మొదలైన వాటికి స్థానం ఇవ్వకూడదు. దృఢత్వమే మనిషిని లేపి నిలబెట్ట గలుగుతుంది. దృఢత్వం సంకల్పశక్తి సడలిపోయే పనులకు దూరంగా ఉందాలి.  జీవితమనె సొంత ఇంటికి స్వయంగా ద్వారపాలకులుగా ఉండాలి. శీలవంతుడైన వ్యక్తి పర్వతంలా దృఢంగా ఉంటాడు. అతని దృష్టిలో అతడి  సిద్ధాంతానికి, శీలానికి మాత్రమే విలువున్నది. ప్రపంచంలోని ధన, ధాన్య, సౌభాగ్యాల కోసం అతడు  శీలాన్ని బలిపెట్టడు. అతడి విజయం అందులోనే ఉంది.

-నందిరాజు రాధాకృష్ణ   

Leave a Reply