ఊహించని టాస్క్: ఎలిమినేషన్ నుంచి ఆ ముగ్గురు సేఫ్

secret task in big boss telugu
Share Icons:

 

హైదరాబాద్:

బిగ్ బాస్ చరిత్రలో ఊహించని విధంగా ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిని  మధ్యలోనే సేవ్ చేశారు. సోమవారం ఎలిమినేషన్ లో నామినేట్ అయిన ఆరుగురు సభ్యులు రాహుల్, రవికృష్ణ, వరుణ్ సందేశ్, మహేష్ విట్టా, పునర్నవి, హిమజలకు బిగ్ బాస్ ఓ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. అయితే ఇందులో ముగ్గురు మాత్రమే టాస్క్ ఆడుతారని చెప్పడంతో రవి, వరుణ్, రాహుల్ టాస్క్ ఆడారు. మిగిలిన ముగ్గురు ఎలిమినేషన్ లోనే ఉన్నారు.

డీల్‌లో భాగంగా బిగ్ బాస్ ముందుగా రవికృష్ణకు ఛాలెంజ్ ఇచ్చారు. యాక్టివిటీ రూంలో బోర్డుపై మొత్తం 8 ఛాలెంజ్‌లు రాసి పెట్టారు. వీటిలో రెండింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రవి ఎంపిక చేసుకున్నవి.. 1. ఒకరి తలనిండా సేవింగ్ ఫోమ్ రాయాలి 2. ఒకరి బెడ్‌ని పూర్తిగా నీటితో తడపాలి. ముందుగా రవి షేవింగ్ ఫోమ్ ని వితిక మీద కొట్టేశాడు. తర్వాత శివ జ్యోతి బెడ్ ని నీటితో తడిపేశాడు.

ఇక బిగ్ బాస్ ఇచ్చిన 8 ఛాలెంజుల్లో రాహుల్ ఎంపిక చేసుకున్న రెండు.. 1. ఇంట్లో ఒకరికి బాగా కోపం తెప్పించి వారు మీపై అరిచేలా చేసి వారితో గొడవ పడాలి 2. వరుణ్ మరియు వితిక హార్ట్ షేప్ కుషన్‌ని కట్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో విసరాలి. వీటిలో మొదటిగా హార్ట్ షేప్ కుషన్‌ను కట్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో వేసేశాడు. ఆ తర్వాత రాహుల్ అలీ,జ్యోతి, శ్రీముఖి, హిమజలని రెచ్చగొట్టి గొడవపడేలా చేశాడు.

బిగ్ బాస్ ఇచ్చిన 8 ఛాలెంజుల్లో వరుణ్ ఎంచుకున్నవి.. 1. చల్లని కాఫీని ఒకరి మీదకి విసరాలి 2. హౌస్‌లో ఎవరైనా ఒకరి ఇష్టమైన బట్టలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. మొదటిది తన భార్యపై ప్రయోగించేశాడు. ఆ తరవాత స్లీపింగ్ రూంలోకి వెళ్లి వితికాకు ఇష్టమైన బట్టలు తీసి ముక్కలుగా కత్తిరించాడు. చివరకు ముగ్గురు విజయవంతంగా టాస్కులు పూర్తి చేయడంతో వీరు ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతారని ప్రకటించారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ లో పునర్నవి, మహేశ్,హిమజలు ఉన్నారు.

Leave a Reply