రెండో టీ20కు తుఫాన్ గండం…

Second T20 International at Rajkot could be hit by 'very heavy rains' from Cyclone Maha
Share Icons:

రాజకోట్: మూడు టీ20 మ్యాచ్ ల్లో భాగంగా రెండో టీ20 రేపు రాజ్ కోట్ వేదికగా జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి టీ20లో బంగ్లాదేశ్ చేతిలో చావుదెబ్బ తిన్న టీమిండియా రెండో మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని భావిస్తుంది. కానీ అందుకు వరుణ దేవుడు సహకరించేలా కనిపించడం లేదు.  అరేబియా సముద్రంలో ఏర్పడిన మహా తుపాను…భీకర రూపం ధరించి…రాజ్ కోట మీదుగా దాటే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

మ్యాచ్ గురువారం జరుగనుండగా..మంగళ, బుధవారాలలో రాజ్ కోటను మహా తుపాను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు…మ్యాచ్ వేదిక రాజ్ కోట క్రికెట్ స్టేడియం వికెట్ , అవుట్ ఫీల్డ్ ను ..ముందు జాగ్రతగా కవర్లతో కప్పి ఉంచామని..ఎంత భారీవర్షం కురిసినా.. కొద్ది సమయంలోనే మ్యాచ్ నిర్వహించడానికి తాము సిద్ధమని స్టేడియం నిర్వాహకులు చెబుతున్నారు.

పంత్ కు ఆసీస్ మాజీ కీపర్ సలహా

ఇటీవల జరిగిన టీ20, వన్డే మ్యాచ్ లకు ధోని దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ధోని స్థానంలో యువ ఆటగాడు రిషబ్ పంత్ ని కొనసాగిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లకు కూడా పంత్ కీపర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ పంత్ కు కొన్ని సూచనలు చేశాడు.

తాను ఇంతకు ముందు చెప్పినట్లుగా పోలికలపై మాట్లాడనని, భారతీయుల అభిమానులు పంత్ ని ధోనితో పోల్చకూడదనేది తన అభిప్రాయమని గిల్ క్రిస్ట్ చెప్పాడు. రిషబ్ పంత్ ప్రతిభ కలిగిన యువ ఆటగాడు. అప్ఫుడే అతనిపై ఎక్కువ ఒత్తిడి చేయవద్దు. రాబోయే రోజుల్లో ప్రతిరోజూ అతడు ధోని తరహా ప్రదర్శనలు ఇస్తాడని ఆశించండి” అని ఆడమ్ గిల్ క్రిస్ట్ పేర్కొన్నాడు.

“రిషబ్ పంత్‌కు నా సలహా ఇదే: ధోని నుండి నువ్వు ఏం నేర్చుకోగలవో నేర్చుకో. ధోనిగా ఉండటానికి మాత్రం ప్రయత్నించవద్దు. నువ్వు రిషబ్ పంత్‌గా మాదిరే ఉండేందుకు ప్రయత్నించు” అని అన్నాడు.

 

Leave a Reply