పీఎం కిసాన్ సమ్మాన్ నిధి: ఏప్రిల్1 నుండి మరో 2వేలు…

Share Icons:

ఢిల్లీ, 1 మార్చి:

రైతులకు పెట్టుబడి సాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఏడాదికి రూ. 6 వేలు ఇవ్వడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇక ఈ పథకాన్ని ఈ నెల 24 నుండి ప్రధాని మోదీ ప్రారంభించారు. 2018 డిసెంబర్ నుంచే రైతులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం… ఫిబ్రవరి 24 నుంచే మొదటి వాయిదా రూ.2,000 చొప్పున 1.01 కోట్ల మంది రైతులకు రూ.2,021 కోట్లు జమ చేసింది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1న రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ను రూ.2,000 చొప్పున రైతుల అకౌంట్‌లోకి జమ చేయనుంది. మొదటి విడతకు ఆధార్ తప్పనిసరి కాదని, ఆ తర్వాతి నుంచి రైతులు ఆధార్ ధృవీకరణ చేయాల్సి ఉంటుందని గతంలోనే కేంద్రం ప్రకటించింది. అయితే ఇప్పుడు రెండో విడతకు కూడా ఆధార్ అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే ఈ పథకం ద్వారా 12 కోట్ల మందికి పైగా రైతులు లబ్ది పొందనున్నారు. అయితే మొదటి విడతలో ఒక కోటి మందికి మాత్రమే లబ్ది చేకూరింది. మిగతా రైతుల ఎకౌంట్‌లో ఎప్పటికీ పడతాయో తెలియాల్సి ఉంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి కూడా ఈ మొదటి విడత డబ్బులు పడలేదని తెలుస్తోంది.

మామాట: చివరికి ఈ పథకం ద్వారా ఎంతమంది రైతులు లబ్ది పొందుతారో చూడాలి

Leave a Reply