అయోధ్యపై మాదే తుది తీర్పు… సుప్రీం కోర్టు

Share Icons:

కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 27,

అయోధ్యలో రామమందిరం – బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసును ఐదుగురు జడ్జీల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ అశోక్ భూషణ్ ల బెంచ్ అభిప్రాయపడింది. ఈ కేసును సుప్రీంకోర్టు అక్టోబర్ చివరివారంలో విచారిస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీసుకునే తుది నిర్ణయంపై 1994లో ఇస్మాయిల్ ఫారూఖీ కేసులో ఇచ్చిన తీర్పు ఎలాంటి ప్రభావం చూపబోదని ధర్మాసనం తెల్చిచెప్పింది. ఈ సందర్భంగా మెజారిటీ అభిప్రాయంతో జస్టిస్ నజీర్ విభేదించారు.

మరోవైపు సుప్రీం తాజా తీర్పుతో అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి మరో అడుగు దగ్గర పడిందని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. త్వరలోనే ఆయోధ్యలో రామమందిరం నిర్మాణమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  కాగా ఎన్నికల సంవత్సరంలో అయోధ్య వివాదం మరో వారు తెరపైకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

మామాట: రామా,  మీ మాట ఎవరూ వినడం లేదు, ఆచరించడం లేదయ్యా..

Leave a Reply