పౌరనేతల హౌస్ అరెస్ట్ పొడిగింపు

Share Icons:

కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 06,

ఇప్పటికే గృహనిర్బందంలో ఉన్న ఐదుగురు పౌర హక్కుల నేతలకు ఈ నెల 12 వ తేదీ వరకు నిర్భందం పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఏఎం.ఖాన్విల్కర్, డివై. చంద్రచూడ్ లతో కూడిన ధర్మాసనం కేసు విచారణ సందర్భంగా పూణే ఏసీపీ వ్యవహార శైలిపై అసహనం వ్యక్తం చేసింది. మీ పోలీసులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని మహరాష్ట్ర ప్రభుత్వానికి చూచించింది. కొర్టు విచారణలో ఉన్న అంశంపై ఎలా మాట్లాడాలో వారికి చెప్పండి, వారి నుంచి (పోలీసులు)కోర్టుసలహాలు తీసుకునే స్థితిలో లేదని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, నిర్భందంలో ఉన్న పౌరహక్కుల నాయకులకు నిషేదిత సిపిఐ (మావోయిస్టు) దళాలతో సంబంధాలున్నాయని, అందుకే అరెస్ట్ చేశామనీ, వారి భావాలను వ్యతిరేకించి కాదని మహరాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది విన్నవించారు. అనంతరం ధర్మాసనం కేసు తదుపరి విచారణను ఈ నెల 12 వ తేదీకి వాయిదా వేసింది.

మామాట:  ఇలా వాయిదాలపై వాయిదాలు పడుతుంటాయా..

Leave a Reply