TRENDING NOW

సెక్షన్ 377 పై విచారణ

సెక్షన్ 377 పై విచారణ

కొత్త ఢిల్లీ, జూలై 10,    స్వలింగ సంపర్కం వంటి వివాదాస్పద అంశాలు కలిగిన సెక్షన్‌-377 తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ విచారణ వాయిదా వేయాలంటూ కేంద్రం తరపున అదనపు సోలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు విజ్ఞప్తి చేశారు. అయితే  ‘సామాజిక నైతికతలో మార్పులు వస్తున్నాయి. అందుకే తీర్పులోని తప్పుఒప్పులను పునఃసమీక్షించాలని నిర్ణయించాం’ అని ధర్మాసనం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఆర్‌ఎఫ్‌ నారీమన్‌, వైవీ చంద్రచూడ్‌, ఎఎమ్‌ కన్వీల్కర్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన విస్తృత ధర్మాసనం రిప్యూ పిటిషన్‌ను విచారణ చేపట్టింది. ‘సమాజంలో మార్పులు వస్తున్నాకొద్దీ.. విలువలు కూడా మారుతున్నాయి. కాబట్టి స్వలింగ సంపర్కం నేరం కాదు’ అని పిటిషనర్ల తరపున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి (మాజీ అటార్నీ జనరల్‌) వాదనలు వినిపించారు.  కాగా ఐపీసీ సెక్షన్‌ 377 ప్రకారం  ప్రకృతి విరుద్ధంగా జరిగే లైంగిక సంపర్కం నేరం. మగవాళ్ళు మగవాళ్లతో.. లేదా మహిళలు మహిళలతో శృంగారంలో పాల్గొనడం అనైతిక చర్యగా పరిగణిస్తారు. ఐపిసి 377 సెక్షన్‌ కింద ‘అసహజమైన నేరాల’ (ఎవరైనా పురుషుడు, లేదా స్త్రీ, లేదా జంతువుతో అసహజ సంపర్కానికి) పాల్పడేందుకు ప్రయత్నించినా, పాల్పడినా వారికి యావజ్జీవిత జైలు శిక్ష, లేదా పదేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం వుంది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించొచ్చు.

1861లో ఈ సెక్షన్‌ను అప్పటి బ్రిటిష్‌ పాలకులు భారత శిక్షా స్మృతిలో ప్రవేశపెట్టారు. ఈ సెక్షన్‌ను సవాలు చేస్తూ 2001లో నాజ్‌ ఫౌండేషన్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు ఇద్దరు వయోధికుల మధ్య పరస్పర అంగీకారంతో జరిగే గే సెక్స్‌ ‘నేరం కాదని’ తేల్చింది.  రాజ్యాంగంలోని 14, 15, 21ల అధికరణాల్ని 377 సెక్షన్‌ ఉల్లంఘిస్తోందని పేర్కొంది. ఈ తీర్పును కొందరు సుప్రీంకోర్టులో సవాలు చేయడంతో తీర్పుపై అభిప్రాయాన్ని వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. చివరకు డిసెంబర్‌ 11, 2013న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీం కొట్టివేస్తూ 377 సెక్షన్‌ రాజ్యాంగ విరుద్ధం కాదని, నేరమని తేల్చి చెప్పిది.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

అనంతరం తీర్పును సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వం, గే హక్కుల కార్యకర్తలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అనంతరం పలువురు క్యూరేటివ్‌ పిటిషన్లు దాఖలు చేయడంతో.. ఫిబ్రవరి 2, 2016న వాటిని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మసనానికి సిఫార్సు చేసింది.  దాదాపు 26కు పైగా దేశాలు ఇప్పటికే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ చట్టం చేశాయన్న విషయాన్ని ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులు గుర్తుచేస్తున్నారు.

అది హిందూ సంప్రదాయం కాదు.. స్వామి

స్వలింగ సంపర్కం సహజమైన ప్రక్రియ కాదని, హందుత్వకు పూర్తిగా వ్యతిరేకమని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అన్నారు. స్వలింగ సంపర్కం నుంచి జనాలు బయటపడేందుకు మెడికల్ రీసర్చ్ ద్వారా మార్గాలు వెతకాల్సిన అవసరం ఉందని అన్నారు. స్వలింగ సంపర్కులను చూసి ఆనందించడం కానీ, వారికి మద్దతు పలకడం కానీ సరైన చర్య కాదని చెప్పారు. స్వలింగ సంపర్కులను క్రిమినల్స్ గా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377పై మరోసారి వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం సిద్ధమైన తరుణంలో స్వామి ఈ మేరకు స్పందించారు. సాధారణ ధర్మాసనం కాకుండా… ఏడుగురు లేదా తొమ్మిది మందితో కూడిన విస్తృత ధర్మాసనం ఈ పిటిషన్ కు సంబంధించిన వాదనలను వింటే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మామాట : కాలంతోపాటూ మారాలంటే ఏంటో అనుకున్నా… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: