ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బి‌ఐ: ఇక ఆ లావాదేవీలు ఉచితం

sbi-waives-charges-on-electronic-transfers
Share Icons:

ముంబై:

 

తమ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.  ఇకపై ఐ‌ఎం‌పి‌ఎస్(ఇమ్మీడియెట్‌ పేమెంట్‌ సర్వీస్‌)లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని ప్రకటించింది. నగదు రహిత ఆర్థిక వ్యవస్థను తీర్చిదిద్దటంలో భాగంగా ఈ నెల 1 నుంచి ఈ తరహా లావాదేవీలపై చార్జీలను విధించరాదని ఆర్‌బీఐ ఆదేశించిన సంగతి తెలిసిందే.

 

దీంతో ఆగస్టు 1 నుంచి మొబైల్‌ ఫోన్ల ద్వారా ఐఎంపీఎస్‌ విధానంలో నగదు బదిలీ చేస్తే ఎలాంటి చార్జీలను విధించరాదని నిర్ణయించినట్లు ఎస్‌బీఐ తెలిపింది. అలాగే  ఎన్‌ఈ‌ఎఫ్‌టి(నేషనల్‌ ఎలకా్ట్రనిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌), ఆర్‌టి‌జి‌ఎస్(రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌)  రూ.2 లక్షల వరకు నగదు బదిలీపై చార్జీలను మినహాయించినట్లు తెలిపింది.

 

కాగా ఈ నెల 1 నుంచే యోనో, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ (ఐఎన్‌బీ), మొబైల్‌ బ్యాంకింగ్‌ (ఎంబీ) వినియోగదారుల కోసం ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ చార్జీలను ఎస్‌బీఐ ఎత్తివేసింది. ఆగస్టు 1 నుంచి ఐఎన్‌బీ, ఎంబీ, యోనో ఖాతాదారుల కోసం ఐఎంపీఎస్‌ చార్జీలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. జూలై 1వ తేదీకి ముందు నెఫ్ట్‌ లావాదేవీలపై రూ.1, రూ.5 చార్జీలను విధించగా, ఆర్‌టీజీఎస్‌ విధానంలో రూ.5-రూ.50 వరకు చార్జీలను వసూలు చేసింది.

 

అయితే 2019 మార్చి చివరినాటికి ఎస్‌బీఐలో దాదాపు 6 కోట్లకు పైగా ఖాతాదారులు ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో 1.41 కోట్ల మంది మొబైల్‌ బ్యాంకింగ్‌ సర్వీసులను వినియోగిస్తున్నారు.

Leave a Reply