ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు

Share Icons:

హైదరాబాద్‌, ఏప్రిల్ 15,

బ్యాంక్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. మొత్తం 8,653 క్లరికల్ పోస్టులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌లో 425 ఖాళీలున్నాయి. 8,653 జూనియర్ అసోసియేట్ లేదా క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. శుక్రవారం అఫీషియల్ నోటిఫికేషన్ విడుదలైంది.

అర్హులైన అభ్యర్థులు sbi.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 3న ముగుస్తుంది. దేశంలోని అన్ని బ్రాంచుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎస్‌బీఐ. ప్రిలిమినరీ ఎగ్జామ్ 2019 జూన్‌లో నిర్వహించే అవకాశముంది. మొత్తం 8,653 క్లర్క్ పోస్టుల్లో 3,674 జనరల్ కేటగిరీకి, 853 ఆర్థికంగా వెనకబడిన తరగతులకు, 1,361 పోస్టులు షెడ్యూల్డ్ కులాలకు, 799 పోస్టులు షెడ్యూల్డ్ తెగలకు, 1,966 పోస్టుల్ని ఓబీసీలకు కేటాయించారు.

20 నుంచి 28 ఏళ్ల వయస్సు గల వారంతా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీలకు వయస్సులో సడలింపు ఉంటుంది.   దరఖాస్తు చేయండి ఇలా…

ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ www.sbi.co.in ఓపెన్ చేయండి.

ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ‘Career’ పేజీ క్లిక్ చేయండి.

అందులో ‘recruitment for junior associates’ లింక్ పైన క్లిక్ చేయండి.

ముందుగా ‘Download Advertisement’ నోటిఫికేషన్ మొత్తం చదవండి.

ఆ తర్వాత ‘Apply Online’ క్లిక్ చేసి దరఖాస్తును పూర్తి చేయండి.

దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

 

ఫీజు వివరాలు- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.125

జనరల్, ఆర్థికంగా వెనకబడిన తరగతులు, ఓబీసీ అభ్యర్థులకు రూ.750

 

 

Leave a Reply