మాల్దీవుల్ని ఆదుకోవాలి

Share Icons:

మాల్దీవుల్ని ఆదుకోవాలి

అమెరికా, చైనాలు క‌లిసి చిచ్చుపెడుతున్న మాల్దీవుల్లో భార‌త్ పాత్ర ఏమిటి?

విదేశాంగ విధానంలో త‌మ‌కు తామే సాటి అని చెప్పుకుంటున్న న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం మాల్దీవులలో చెల‌రేగుతున్న ఘ‌ర్ష‌ణ‌ల‌ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ రాజ‌కీయ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్న‌ది.

1965లో బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందిన మాల్దీవులు 1988లో తీవ్ర సంక్షోభానికి లోన‌య్యాయి.1988 నవంబర్‌లో అప్పటి అధ్యక్షుడు మన్‌మూన్ అబ్దుల్ గయూమ్ ప్రభుత్వాన్ని తొలగించడానికి కిరాయి మూకలు ప్ర‌య‌త్నించ‌గా అక్క‌డి పోలీసులు- సైనికులు నిరోధించలేకపోయారు.

మాల్దీవుల‌ ప్రభుత్వం అభ్యర్థన మేరకు మన నౌకాదళం రంగప్రవేశం చేసింది. మన యుద్ధనౌకలు వెళ్లి కిరాయి మూకల ముట్టడిలో ఉన్న‌ రాజధాని మాలే నగరాన్ని, నిర్బంధంలో ఉన్న‌ అధ్యక్షుడిని, ఇతర రాజకీయ వేత్తలను విముక్తి చేయగలిగాయి.

రాజీవ్‌ ప్రభుత్వం ముందుకు మాల్దీవుల అంశం వచ్చినప్పుడు ‘దక్షిణాసియాలోని ఓ చిన్న దేశంలో అస్థిర పరిస్థితులు ఏర్పడితే వాటిని చక్కదిద్దాల్సిన బాధ్యత దక్షిణాసియాలోనే అతిపెద్ద దేశమైన భారత్‌పైన ఉంటుంది.

అంతేకాకుండా అస్థిర పరిస్థితులను చూస్తూ ఊరుకుంటే ఒక్కోసారి మనదేశంలో కూడా అలాంటి పరిస్థితు ఏర్పడవచ్చు.

ఈ ప్రాంతంలో ఓ బాధ్యతగల దేశంగా సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని నాటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ఉన్నతాధికారుతో వ్యాఖ్యానించారు.

ఉన్నత సైనిక, పౌర అధికారులంతా చాలాసేపు తర్జనభర్జన పడినప్పటికీ విషయం తెల్సిన తొమ్మిది గంటల్లోనే 1600 మంది భారత సైన్యం మాలిలో దిగింది.తన ఆపరేషన్‌ను నిర్విఘ్నంగా నిర్వహించింది.

ఆపరేషన్‌ కాక్టస్‌ తర్వాత మాల్దీవులకు ఆర్థిక, సైనిక‌ సహకారాన్ని భారత్‌ అందిస్తున్నప్పటికీ ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంటూ వస్తోంది.

ఇప్పటికే చైనాను దూరం చేసుకున్న భారత్‌ మాల్దీవుల్లో జోక్యం చేసుకుంటే చైనాతో మరింత శత్రుత్వం పెరుగుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆప‌రేష‌న్ కాక్ట‌స్ ఇప్పుడు నిర్వ‌హించ‌లేమా?

ప్రజాస్వామ్యాన్ని రక్షించే పేరుతో ఓ దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించడం సమంజసం కాదని వారంటున్నారు.

ఆపరేషన్‌ కాక్టస్‌ లాంటి ఆపరేషన్‌ను ఇప్పుడు నిర్వహించలేమని రక్షిణ శాఖ నిపుణుడు నితిన్‌ గోఖ్లే అన్నారు.

మాల్దీవుల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. మాల్దీవులు అధ్యక్షుడు అబ్దుల్లా ఎమీన్ చైనాకు మోక‌రిల్లుతున్నారు.

మాల్దీవుల్లో మెజార్టీ ప్రజలు తమ అధ్యక్షుడు ఎమీన్‌కు వ్యతిరేకంగా భారత్ వ్యవహరించాలని కోరుకుంటున్నారు.

ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ విషయంలో భారత్ సాయం కోసం ఎదురు చూస్తున్నాయి.

యూరీ దాడి ఘటన తర్వాత పాకిస్థాన్‌లో సార్క్ సదస్సును బాయ్‌కాట్ చేద్దామని మనం పిలుపునిస్తే.. క్షణం ఆలస్యం చేయకుండా మాల్దీవులు మనకు బాసటగా నిలిచింది.

బాగా పెరిగిన ఇస్లామిక్ ఉగ్ర‌వాదం

అలాంటి దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని నివారించడం మన బాధ్యత. ఎమీన్ పాలనలో మాల్దీవుల్లో ఇస్లామిక్ తీవ్రవాదం పెరిగింది.

ఇది భారత్ భద్రతకు కూడా ముప్పుగా మారనుంది.

మాల్దీవుల్లో 25 వేల మంది భారతీయులు నివసిస్తున్నారు. ఏటా ఆ దేశానికి వెళ్లే పర్యాటకుల్లో భారతీయులే 6 శాతం మంది. విద్య, వైద్యం, వ్యాపారం ఇలా ఏ చిన్న పనికైనా భారత్ రావడానికే మాల్దీవుల ప్రజలు మొగ్గు చూపుతారు.

ఇక్కడ ఉన్నత చదువులు చదవడానికి, వైద్య చికిత్స కోసం దీర్ఘాకాలిక వీసాల కోసం మాల్దీవుల ప్రజలు ఎదురుచూస్తుంటారు. ఇన్నిరకాలుగా భారత్‌తో సంబంధాలున్న మాల్దీవుల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకునే ప్రభుత్వం ఏర్పాటు కావడం ఆ దేశానికే కాకుండా భారత్‌కు కూడా ఎంతో అవసరమే. అధ్యక్షుడు ఎమీన్‌ గద్దె దిగితే అది చైనాకు చెంప పెట్టు కావడంతోపాటు మనకు కలిసి వచ్చే అవకాశం ఉంది.

ఒకవేళ భారత్ మాల్దీవులు సుప్రీం కోర్టుకు, ప్రజానీకానికి బాసటగా నిలిస్తే.. పరోక్షంగా డ్రాగన్‌కు చెక్ పెట్టినట్లే.

1965లో స్వాతంత్య్రం పొందిన మాల్‌దీవులు అప్పటి నుంచి దశాబ్ది క్రితం వరకూ మన దేశంతో అత్యంత సన్నిహిత సంబంధాలను కలిగి ఉంది. చైనాకు 2010 వరకూ ఈ దీవుల్లో దౌత్య కార్యాలయం లేదు.

చైనా మాల్‌దీవుల్లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేసుకోగలగడం కూడ మన వ్యూహాత్మక వైఫల్యం. 2010 వరకూ మనకు, శ్రీలంకకు, మరో రెండు దేశాలకు మాత్రమే అక్క‌డ దౌత్య కార్యాలయాలున్నాయి.

అమెరికా, రష్యా వంటి దేశాలు కూడా మన దేశంలోని లేదా శ్రీలంకలోని తమ రాయబార కార్యాలయాల ద్వారా మాత్రమే మాల్దీవులతో వ్యవహరించేవి,అంత‌ర్జాతీయ‌ వ్యవహారాలకు అధిక ప్రాముఖ్యత ఇస్తున్న నరేంద్ర మోదీ మల్దీవుల సంక్షోభంలో జోక్యం చేసుకుంటే ఇంటా బయట ఆయన ప్రతిష్ట పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరి, ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి!

English Summery: the world is waiting anxiously about the stand of India on Maldives. If India takes a stand like in 1988, another questing raises that like Operation Cactus possible now?

Leave a Reply