ఈసారి కోడెలకి గెలుపు అంత సులువు కాదా?

Share Icons:

గుంటూరు, 21 మార్చి:

గత ఎన్నికల్లో తెదేపా సీనియర్ నేత, స్పీకర్ కోడెల శివప్రసాద్ సత్తెనపల్లి నుండి పోటీ చేసి కేవలం 900 ఓట్లతో వైసీపీ నేత అంబటి రాంబాబు మీద విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి ఎన్నికల్లో ఇరువురు నేతలు మరోసారి బరిలో దిగారు.  ఇద్దరు నేతలు సొంత పార్టీల నుండి అసంతృప్తి ఎదుర్కుంటూనే టికెట్ దక్కించుకున్నారు. ఇక గత ఎన్నికల్లో గెలిచి స్పీకర్ పదవి చేపట్టిన కోడెల నియోజకవర్గంలో మంచి అభివృద్ధే చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్లు. సి‌సి రోడ్ల నిర్మాణం, అంగనవాడిల నిర్మాణం బాగా జరిగాయి. సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువయ్యేలా చేశారు.

ఇక ఈ ఐదు సంవత్సరాలు కోడెల కుమారుడు శివరాం సత్తెనపల్లిలో దౌర్జన్యంగా భూకబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారని, ఇందులో వందల కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. పైగా కోడెలకి అసంతృప్త నేతలు సహకరించడం కష్టం. కాబట్టి ఈ సారి కోడెల గెలుపు కష్టమే అని తెలుస్తోంది.

అటు వైసీపీ నుండి పోటీ చేస్తున్న అంబటి రాంబాబు మీద కూడా స్థానిక నేతల్లో అసంతృప్తి ఉంది. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శ ఉంది. అయితే కోడెల మీద ఉన్న వ్యతిరేకిత, వైసీపీకి పెరిగిన ప్రజాబలం తనని గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. మంచి మాటకారిగా రాంబాబుకి పేరుంది. మరోవైపు ఇక్కడ జనసేన అభ్యర్థి గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గంలో కమ్మ, ముస్లిం, మాదిగ, కాపు,రెడ్డి వర్గాలు కీలకం కానున్నారు. మరి చూడాలి ఈ సారి అంబటి కోడెలకి చెక్ పెడతారేమో..

మామాట: మరి సత్తెనపల్లి ఈ సారి ఎవరి సొంతం కానుందో

Leave a Reply