బీజేపీని వీడేటప్పుడు అద్వానీ కంటతడి పెట్టారు: శతృఘ్నసిన్హా

Share Icons:

ఢిల్లీ 15 మే:

 మొన్నటివరకు బీజేపీలో ఉన్న బాలీవుడ్ సీనియర్ నటుడు శతృఘ్నసిన్హా…. ఇటీవల ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరి పట్నా సాహిబ్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. అయితే బీజేపీని వీడేటప్పుడు తాను ఎల్కే అద్వానీని కలిశానని చెప్పారు.

ఈ పార్టీని వీడే విషయం విన్న ఆయన కంటతడి పెట్టుకున్నారే తప్ప, తనను వెళ్లవద్దని మాత్రం చెప్పలేదని అన్నారు. తాను మరో మార్గంలో వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పి, ఆయన ఆశీస్సులు తీసుకున్నానని, తాను ఇప్పుడు సరైన దారిలోనే వెళుతున్నానని ఆయన అన్నారు.

ఇక శత్రుఘ్న బీజేపీని వీడే చివరి రోజుల్లో నిరసన గళం వినిపించిన విషయం తెలిసిందే. అప్పటి బీజేపీకి, ఇప్పటి బీజేపీకి  ప్రజాస్వామ్యానికీ, నియంతృత్వానికి మధ్య ఉన్నంత తేడా ఉందని, సీనియర్‌ నాయకులను తగిన గౌరవం లభించడం లేదని శతృఘ్నసిన్హా వ్యాఖ్యానించారు. తాను అద్వానీలా మౌనంగా ఉండలేకపోయానని, అందువల్లే బీజేపీకి రాజీనామా చేశానని అన్నారు.

మామాట: ఈ విషయం వెంటనే చెబితే బాగుండేదిగా

Leave a Reply