TRENDING NOW

ఉపగ్రహాలు ప్రయోగించే విమానం!

ఉపగ్రహాలు ప్రయోగించే విమానం!

 అమెరికా, ఏప్రిల్ 15,

విశాలమైన రెక్కలతో… ప్రపంచంలోనే అత్యంత పెద్దదని చెబుతున్న విమానం తొలిసారి గాల్లోకి ఎగిరింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఆల్లెన్ 2011లో స్థాపించిన స్ట్రాటోలాంచ్ కంపెనీ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారుచేసింది. ఉపగ్రహాలకు ఫ్లయింగ్ లాంచ్‌ప్యాడ్‌లా పని చేయడానికి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించారు.

Life Homepathy
treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

అయితే, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ముందు 10 కి.మీ. దూరం విమానాన్ని నడిపారు. దీని రెక్కల పొడవు 385 అడుగులు. అది అమెరికాలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ విస్తీర్ణం కంటే ఎక్కువ.  ఈ ప్రాజెక్టు విజయవంతమైతే,   ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తక్కువ ఖర్చుతో పంపవచ్చు. విమానంలో ప్రధాన భాగాన్ని ఫ్యూస్లేజ్ అంటారు. ఈ విమానంలో రెండు ఫ్యూస్లేజ్‌లు ఉన్నాయి. ఇందులో మొత్తం 6 ఇంజిన్లు ఉంటాయి.

ఈ విమానం మొదటిసారిగా గంటకు 274కి.మీ. వేగంతో, 15వేల అడుగులదాకా ఎగిరింది. పైలట్ థామస్ మీడియాతో మాట్లాడుతూ, ఈ విమానాన్ని నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని, అంతా అనుకున్నట్లుగానే జరిగిందన్నారు. ”ఈరోజుల్లో విమానాలు అందుబాటులో ఉన్నంత సాధారణంగానే, భూ కక్ష్యను కూడా ప్రయోగాలకు అందుబాటులో తేవడమే మా లక్ష్యం” అని స్ట్రాటోలాంచ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

మామాట: సాంకేతిక ప్రగతికి అడ్డేలేదుగా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: