మళ్లీ రాజకీయాల్లోకి శశికళ…

Share Icons:
  • మద్దతుదారులతో చూచాయగా చెబుతున్న చిన్నమ్మ!
  • జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాలకు దూరమైన శశికళ
  • తాజాగా మళ్లీ రాజకీయాలపై దృష్టి సారించిన చిన్నమ్మ
  • తానొచ్చి పార్టీని బాగుచేస్తానని భరోసా

అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైన తర్వాత శశికళ అన్నాడీఎంకే పగ్గాలు పుచ్చుకుంటారని అందరూ భావించినప్పటికీ, ఆమె అనూహ్యంగా మనసు మార్చుకున్నారు. తన పయనం ఆధ్యాత్మికత వైపేనని ప్రకటించారు.

అయితే, తాజాగా ఆమె దృష్టి తిరిగి రాజకీయాలపై పడిందని, తాను మళ్లీ వచ్చేస్తానని  మద్దతుదారులకు చూచాయగా చెప్పినట్టు తెలుస్తోంది. అంతర్గత కుమ్ములాటలతో పార్టీ నాశనం అవుతూ ఉంటే చూస్తూ కూర్చోలేనని, తానొచ్చి పార్టీని గాడిలో పెడతానని మద్దతుదారులతో చెప్పినట్టు సమాచారం.

ఈ మేరకు వారితో ఫోన్‌లో మాట్లాడుతూ ధైర్యం నింపుతున్నారు. పార్టీ తీరుపై దిగులు చెందొద్దని, తానొచ్చి పార్టీని బాగుచేస్తానని, జాగ్రత్తగా ఉండాలని సూచించినట్టు సమాచారం. అంతేకాదు, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత వచ్చి అందరినీ కలుస్తానని కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply