కొడంగల్‌లో సర్పంచ్ అభ్యర్ధి కిడ్నాప్…రంగంలోకి దిగిన రేవంత్…

Share Icons:

కొడంగల్, 9 జనవరి:

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో కొడంగల్‌లో నిటూరు గ్రామ పంచాయతీ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి బలపరిచిన విశ్వనాథ్ కిడ్నాప్ గురవడం కలకలం రేపుతోంది. మొదటి విడత జరిగే పంచాయితీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ఈరోజు ముగియనుండటంతో కాంగ్రెస్ కార్యకర్తలు కంగారుపడుతున్నారు.

ఇక తమ అభ్యర్ధి కిడ్నాప్‌కి గురవడంతో టీకాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రంగంలోకి దిగారు. పోటీ చేసే అభ్యర్ధి కుటుంబ సభ్యుల నుంచి సమాచారం తెలుసుకుని, కిడ్నాప్ వ్యవహారంపై ఎస్పీ అన్నపూర్ణకు ఫిర్యాదు చేశారు. రేవంత్ ఫిర్యాదుతో పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన రేవంత్ పంచాయితీ ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సమయంలో అభ్యర్ధి కిడ్నాప్ కావడం…నామినేషన్ వేసేందుకు బుధవారం ఆఖరి రోజు కావడంతో రేవంత్ విశ్వనాథ్ తరపున ఇతర సభ్యుని ద్వారా నామినేషన్ వేయించినట్లు తెలుస్తోంది.

మామాట: పంచాయితీ ఎన్నికల సమయంలో ఇలాంటి కిడ్నాప్‌లు ఎక్కువ అయిపోయాయి…

Leave a Reply