TRENDING NOW

బాక్సాఫీస్ వద్ద సర్కార్ జోరు…

బాక్సాఫీస్ వద్ద సర్కార్ జోరు…
Views:
26

చెన్నై, 8 నవంబర్:

దళపతి విజయ్ హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కార్’… దీపావళి కానుకగా ఈ చిత్రం నవంబర్ 6న తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, వసూళ్లపరంగా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను నమోదు చేస్తోంది.

తొలి రోజునే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సుమారు 67 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక రెండవ రోజు కూడా ఈ సినిమా అదే జోరును కొనసాగించింది. రెండు రోజులను కలుపుకుని ఈ సినిమా 110 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.

అలాగే రజనీకాంత్ ‘కాలా’ సినిమా వసూళ్లను కూడా ‘సర్కార్’ అధిగమించింది. 200 కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా చేరిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వినిపిస్తోంది.

మామాట: మొత్తానికి విజయ్-మురుగదాస్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టింది….

 

(Visited 33 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: