పాకిస్తాన్ నటికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన భారత్ టెన్నిస్ స్టార్ సానియా

Share Icons:

 

ఢిల్లీ, 18 జూన్:

వరల్డ్ కప్‌లో భాగంగా మొన్న ఆదివారం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాపై పాకిస్థాన్ నటి వీణా మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

తన భర్త షోయబ్ మాలిక్, కుమారుడు ఇజాన్ లతో పాటు ఇతర పాక్ క్రికెటర్లతో పాటు సానియా గతంలో హుక్కా బార్ కు వెళ్లింది. ఆ సందర్భంగా సానియా హుక్కా తాగుతున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

ఇక ఆ విషయాన్ని సానియాకు ట్యాగ్ చేస్తూ… ‘సానియా మీ అబ్బాయిని కూడా హుక్కా బార్ కు తీసుకెళ్లడం దారుణం. అది చాలా ప్రమాదకరం. పైగా మీరు వెళ్లిన బార్ లో జంక్ ఫుడ్ అమ్ముతుంటారు. ఇలాంటి ఆహారం మీలాంటి క్రీడాకారులకు అనారోగ్యకరం. ఓ తల్లిగా ఈ విషయాలు మీకు తెలిసుండాలి’ అంటూ వీణామాలిక్ కామెంట్ చేసింది.

ఈ వ్యాఖ్యలకు సానియా మీర్జా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది. తన కుమారుడిని తాను ఎక్కడకూ తీసుకెళ్లలేదని… అయినా ఈ విషయాలన్నీ మీకు అనవసరమని చెప్పింది. తన కుమారుడిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో తనకు మాత్రమే తెలుసని వ్యాఖ్యానించింది. పాకిస్థానీ క్రికెటర్లు ఏం తింటారో పట్టించుకోవడానికి తాను పాక్ క్రికెట్ టీమ్ డైటీషియన్ కాదని ఎద్దేవా చేసింది. వారి తల్లిని కాదని, టీచర్ ను అంతకన్నా కాదని చెప్పింది.

Leave a Reply