ఇక సానియా బయోపిక్!

Share Icons:

హైదరాబాద్, ఫిబ్రవరి 9,

బయట ఎన్నికల కాలం లాగా,  సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల కాలం నడుస్తోంది.  తెలుగుతో సహా పలు భాషల్లో జీవితకథలు తెరకెక్కుతున్నాయి. బాలీవుడ్ లో మేరీకోమ్, మిల్కాసింగ్, ధోనీ, మహావీర్ సింగ్ (దంగల్) జీవితాల ఆధారంగా వచ్చిన సినిమాలు  ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా బయోపిక్ కూడా తెరపైకి రానుంది. గత కొంత కాలంగా ఆమె బయోపిక్ పై వస్తోన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. బయోపిక్ కి సంబంధించిన అగ్రిమెంట్ పై సంతకం చేసినట్లు సానియా మీర్జా   వెల్లడించింది. చాలా కాలంగా తన బయోపిక్ పై చర్చలు జరుగుతున్నాయని, ఇప్పటికి కుదిరిందని చెప్పింది.

ఇది తన స్టోరీ కాబట్టి ఇన్‌పుట్స్‌ చాలా కీలకమని ఇంకా సినిమా ప్రారంభ దశలోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. సినిమా కాస్టింగ్, టెక్నికల్ టీమ్ ఎవరనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పరస్పర అంగీకారంతో ముందుకు వెళతామని అన్నారు. ఈ బయోపిక్ ని బాలీవుడ్ దర్శకనిర్మాత రోనీ స్క్రూవాలా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

మామాట: ఇంత అందమైన నటి కావాలి కదా… చూద్దాం..

Leave a Reply