శాంసంగ్ మడతబెట్టే ఫోన్…ఫీచర్లు సూపర్…

Share Icons:

ముంబై: దిగ్గజ మొబైల్స్ తయారీదారు శాంసంగ్.. గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ పేరిట మ‌రో మ‌డ‌త‌బెట్టే స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ ధ‌ర 1380 డాల‌ర్లు (దాదాపుగా రూ.98,400) ఉండ‌గా, అమెరికా, కొరియా మార్కెట్ల‌లో ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను వినియోగ‌దారులు కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఆ త‌రువాత భార‌త్‌తోపాటు ప‌లు ఇత‌ర దేశాల మార్కెట్ల‌లోనూ ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భ్యం కానుంది.

గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ల‌ను ఏర్పాటు చేశారు. అలాగే వెనుక వైపు 12 మెగాపిక్సల్ వైడ్ యాంగిల్ కెమెరాతోపాటు 12 మెగాపిక్స‌ల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇక‌ ముందు భాగంలో 10 మెగాపిక్స‌ల్ కెమెరా ఉంది. ఇక ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌, సైడ్ మౌంటెడ్ ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్ త‌దిత‌ర ఇత‌ర ఫీచ‌ర్ల‌ను వినియోగ‌దారులు పొంద‌వ‌చ్చు.

శాంసంగ్ గెలాక్సీ జ‌డ్ ఫ్లిప్ ఫీచ‌ర్లు…

6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డైన‌మిక్ అమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లే

2636 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

1.1 ఇంచ్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 300 x 112 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్ల‌స్ ప్రాసెస‌ర్‌, 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్

ఇ-సిమ్ + నానో సిమ్‌, 12, 12 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరాలు

10 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా

బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ

శాంసంగ్ నాక్స్ సెక్యూరిటీ, ఫేషియ‌ల్ రిక‌గ్నిష‌న్

3300 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 15 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్

గెలాక్సీ బడ్స్‌ ప్లస్‌

శాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ బడ్స్‌ ప్లస్‌ పేరిట తన నూతన వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను లాంచ్‌ చేసింది. వీటి ద్వారా పవర్‌ఫుల్‌ సౌండ్‌ అవుట్‌పుట్‌ వస్తుంది. గెలాక్సీ బడ్స్‌ ప్లస్‌ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ ధర 149.99 డాలర్లు (దాదాపుగా రూ.10,700) ఉండగా వీటిని మార్చి 6వ తేదీ నుంచి అమెరికా మార్కెట్‌లో విక్రయించనున్నారు. ఆ తరువాత ఇతర దేశాల వినియోగదారులకూ ఈ ఇయర్‌బడ్స్‌ లభ్యం కానున్నాయి. అలాగే కాల్స్‌ చేసుకునేటప్పుడు అవతలి వారికి బ్యాక్‌గ్రౌండ్‌ శబ్దాలు ఎక్కువగా వినపడకుండా ఉంటాయి. వీటిలో ఒక్కో ఇయర్‌బడ్‌లో 85 ఎంఏహెచ్‌ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల 11 గంటల వరకు ఇవి బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. ఇక వీటికి వైర్‌లెస్‌ చార్జింగ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు.

 

Leave a Reply